Petrol Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశంలో తాజా రేట్ల వివరాలు

Petrol Diesel Price Today: కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. గత నెల రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు లేవరు. అయితే ..

Petrol Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశంలో తాజా రేట్ల వివరాలు
Follow us

|

Updated on: May 09, 2022 | 10:36 AM

Petrol Diesel Price Today: కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. గత నెల రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు లేవరు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర పెరిగింది. గత వారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌కు 113 డాలర్ల స్థాయిలో ముగిసింది. ఏప్రిల్ 6 నుంచి పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో చమురు సగటు ధర 1.33 డాలర్ల స్థాయిలో ఉంది. అంటే లీటరుకు రూ. 102. ప్రస్తుతం భారతదేశంలో సగటు పెట్రోల్ ధర లీటరుకు రూ.113గా ఉంది. ఈ నెలలో గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్లలో పెరుగుదల ఉంది. మే 7వ తేదీ శనివారం గృహ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరుగగా.. మే 1న వాణిజ్య సిలిండర్ ధర రూ.104 పెరిగింది.

మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర ఎంత?

ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51 కాగా, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.115.12 ఉండగా, డీజిల్ లీటరు రూ.99.83 చొప్పున విక్రయిస్తున్నారు. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.110.85 ఉండగా, డీజిల్ రూ.100.94గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49 ఉండగా, డీజిల్‌ ధర రూ.105.49గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి