Breaking: గుడ్ న్యూస్! తెలంగాణ విద్యుత్ శాఖలో 1271 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్! రాష్ట్ర విద్యుత్ శాఖ సోమవారం (మే 9) భారీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది..
TSSPDCL AE Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్! రాష్ట్ర విద్యుత్ శాఖ సోమవారం (మే 9) భారీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో 1271 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 70, సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 201, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1000 ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 11నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ http://tssouthernpower.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
Also Read: