Vijay Deverakonda: ఘనంగా విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్.. సెట్లో సందడి చేసిన టీమ్

ఓవర్ నైట్ లో  స్టార్ డమ్ తెచ్చుకొని ఆ క్రేజ్ ను కంటిన్యూ చేస్తున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. నటనతో యాటిట్యూడ్ తో తనదైన మార్క్ ను క్రియేట్ చేశారు ఈ రౌడీ హీరో.

Vijay Deverakonda: ఘనంగా విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్.. సెట్లో సందడి చేసిన టీమ్
Vijay Devarakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2022 | 3:12 PM

ఓవర్ నైట్‌లో  స్టార్ డమ్ తెచ్చుకొని ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). నటనతో యాటిట్యూడ్‌తో తనదైన మార్క్‌ను క్రియేట్ చేశారు ఈ రౌడీ హీరో. యూత్‌లో విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ఈ సెన్సేషనల్ హీరో పుట్టినరోజు. విజయ్ దేవర కొండ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున్న హడావిడి చేస్తున్నారు. విజయ్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ విజయ్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే విజయ్ నటిస్తున్న సినిమా సెట్స్‌లో ఆయన పుట్టిన రోజు వేదికలు ఘనంగా జరిగాయి. తాజాగా విజయ్ దేవరకొండ తన పుట్టినరోజు వేడుకలను వీడీ 11(VD11 )మూవీ సెట్‌లో జరుపుకున్నారు. చిత్ర బృందం సమక్షంలో విజయ్ కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. యూనిట్ అంతా ఆయనకు విశెస్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

విజయ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ సమంత విజయ్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా 16 రోజుల కాశ్మీర్ షూట్ గ్లింప్స్ వీడియో తో చిత్ర యూనిట్ మరో ప్రకటన చేశారు. సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల 16న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.  ప్రస్తుతం ఈ సినిమా కాశ్మీర్ లో లాంగ్ షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటోంది. తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..