AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Mothers Day 2022: సరోగసీ పద్ధతిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ప్రియాంక దంపతులు. ఇక ఇటీవల తమ గారాల పట్టికి మాల్టీ మేరీ చోప్రా జోనస్‌ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు తమ కూతురు ముఖాన్ని బయటకు చూపించలేదీ స్టార్‌ కపుల్‌.

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..
Priyanka Chopra Nick Jonas
Basha Shek
|

Updated on: May 09, 2022 | 2:51 PM

Share

Mothers Day 2022: ప్రముఖ బాలీవుడ్‌ నటి, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఈ ఏడాది జనవరిలో తల్లైన సంగతి తెలిసిందే. అంతకుముందు ఎప్పుడూ ఈ విషయం గురించి మాట్లాడని ఆమె అకస్మాత్తుగా అమ్మైనట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత అన్ని అనుమానాలకు తెరదించుతూ తాము సరోగసీ పద్ధతిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ప్రియాంక దంపతులు. ఇక ఇటీవల తమ గారాల పట్టికి మాల్టీ మేరీ చోప్రా జోనస్‌ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు తమ కూతురు ముఖాన్ని బయటకు చూపించలేదీ స్టార్‌ కపుల్‌. అయితే మాతృమూర్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారి తన ముద్దుల కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసింది ప్రియాంక. అయితే తమ గారాల పట్టి ముఖం కనిపించకుండా కవర్ చేసేశారు. దీంతో పాటు బిడ్డ పుట్టినప్పుడు తమకు ఎదురైన గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేసింది.

మా జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది..

ఇవి కూడా చదవండి

‘ఎట్టకేలకు మదర్స్ డే రోజూ మా పాప ఇంటికొచ్చింది. వంద రోజులకుపైగా NICU(నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లో గడిపిన తర్వాత ఎట్టకేలకు మా పాప మా ఇంట్లో అడుగుపెట్టింది. కొన్ని నెలలుగా మా ప్రయాణం సవాలుగా సాగినా ఇప్పుడు మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నాం. కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది. మా బేబీ ఎన్నో గడ్డు పరిస్థతులను దాటి ఇంటికొచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. లాస్‌ ఏంజిల్స్ లోని సెడార్‌ నినాయ్‌ ఆస్పత్రిలో మా పాప కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి డాక్టర్‌, నర్సు, స్పెషలిస్ట్ లకు మా ధన్యవాదాలు. మా జీవితంలో ఇప్పుడు కొత్త ఆధ్యాయం మొదలైంది. తల్లి తండ్రులుగా మా పాపని మేమెంతగానో ప్రేమిస్తున్నాం. అలాగే నా జీవితంలో ఉన్న మా అమ్మకి, నన్ను బాగా చూసుకున్న వాళ్లందరికి మాతృత్వపు దినోత్సపు శుభాకాంక్షలు. అందరికంటే ముందు నన్ను అమ్మగా మార్చినందుకు నా భర్త నిక్ జోనస్ కి శుభాకాంక్షలు’ అని ఎమోషనల్ గా రాసుకొచ్చిందీ స్వీట్‌ మామ్‌. కాగా ఆమె పొస్ట్‌పై పులువురు బాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. మలైక ఆరోరా, ప్రీతి జింటా, పరిణితి చోప్రా, దియా మిర్జా తదితరులు లవ్‌, హార్ట్‌ ఎమోజీలతో ప్రియాంక, నిక్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Vijay Devarakonda: ‘అందరికీ నా పుట్టిన రోజు సెంటిమెంట్ అయిపోయింది’.. విజయ్‌ ఆసక్తికర ట్వీట్‌..

Jet Airways: మూడేళ్ల తరువాత తిరిగి ఆకాశంలోకి ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్‌.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..