Kangana Viral: ఖరీదైన చీరలో మెరిసిన కంగనా.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Kangana Viral: కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఖరీదైన చీరలో మెరిసిపోతూ కనిపించింది. దాంతో నెటిజన్లంతా ఇప్పడు ఆ చీర గురించే చర్చించుకుంటున్నారు.
Kangana Viral: కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఖరీదైన చీరలో మెరిసిపోతూ కనిపించింది. దాంతో నెటిజన్లంతా ఇప్పడు ఆ చీర గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆమె కట్టిన ఆ చీర ఖరీదు నాలుగు లక్షల పైమాటేనట.. ఇది తెలిసిన నెటిజన్లు వామ్మో ఆ ధర అంటూ నోరెళ్ల బెడుతున్నారు.
ఈ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా నటిస్తున్న చిత్రం ధాకడ్..రాజస్థాన్ జైపుర్‌లోని రాజ్ మందిర్ థియేటర్లో ధాకడ్ చిత్రంలోని తొలి సాంగ్‌ను మే 5న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు కంగనా రనౌత్. తరుణ్ తహిల్యానీ డిజైన్ చేసిన సారీని కంగన ఈ ఈవెంట్‌లో ధరించింది. ‘పీసెస్ ఆఫ్ యూ’ కలెక్షన్లో భాగంగా తరుణ్ రూపొందించిన ఈ చీర ధర 4 లక్షల రూపాయలకు పైనే ఉంటుందట. ఇది తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ చీరలో కంగనా రనౌత్ రాయల్‌గా మెరిసిపోయింది. చీరకు మ్యాచింగ్‌గా కుందన్ నెక్లెస్‌తో పాటు దానికి మ్యాచ్ అయ్యే చెవిపోగులను ధరించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.