AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jet Airways: మూడేళ్ల తరువాత తిరిగి ఆకాశంలోకి ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్‌.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..

Jet Airways@2.o: జెట్ ఎయిర్‌వేస్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. దాదాపు మూడు సంవత్సరాల తరువాత తిరిగి ఆకాశానికి ఎగిరేందుకు చేస్తున్న ప్రయాత్నాలు ఫలిస్తున్నాయి.

Jet Airways: మూడేళ్ల తరువాత తిరిగి ఆకాశంలోకి ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్‌.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..
Jet Airways
Ayyappa Mamidi
|

Updated on: May 09, 2022 | 1:50 PM

Share

Jet Airways@2.o: జెట్ ఎయిర్‌వేస్‌కు హోం మంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చింది. సెక్యూరిటీ క్లియరెన్స్(Security Clearance) పొందిన తర్వాత కంపెనీ త్వరలో తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. మే 5న జెట్ ఎయిర్‌వేస్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టెస్ట్ ఫ్లైట్ నిర్వహించింది. కంపెనీ సీఈవో దీనిని ‘ఎమోషనల్‌ మూమెంట్‌’గా అభివర్ణించారు. సెప్టెంబరు నుంచి విమానాలు ప్రారంభం కావచ్చని కంపెనీ కొత్త సీఈవో సంజీవ్ కపూర్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ అన్నారు. ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికెట్ రెన్యూవల్ తర్వాత.. జూలై-సెప్టెంబర్ క్వార్టర్ లోనే విమాన సర్వీసులను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపారు. మే ప్రారంభంలో సర్టిఫికేట్ పొందవచ్చని కంపెనీ భావిస్తోంది.ఆర్థిక పరిస్థితుల కారణంగా 2019లో ఈ కంపెనీ మూసివేయటం జరిగింది.

అకాశ ఎయిర్ కూడా మే-జూన్ నాటికి ప్రారంభం కావచ్చని అకాశ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వినయ్ దూబే కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఎయిర్‌లైన్ మొదటి వాణిజ్య విమానం జూన్ నెలలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇది కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి 12 నెలల్లో 18 విమానాలను నడపాలని ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్ ప్రతి సంవత్సరం 12-14 విమానాలను సేవలు అందించేందుకు కొనుగోలు చేయనుంది.

జెట్ ఎయిర్‌వేస్ ఎందుకు మూతపడిందంటే..

ఇవి కూడా చదవండి

జెట్ ఎయిర్‌వేస్ 1990ల ప్రారంభంలో టికెటింగ్ ఏజెంట్‌గా మారిన వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ద్వారా ప్రారంభించబడింది. జెట్ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించడం ద్వారా ఎయిర్ ఇండియాకు ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చాడు. ఒకానొక సమయంలో జెట్ ఎయిర్‌వేస్ వద్ద మొత్తం 120 విమానాలు ఉండేవి. ‘ది జాయ్ ఆఫ్ ఫ్లయింగ్’ అనే ట్యాగ్‌లైన్‌తో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ పీక్‌లో ఉన్నప్పుడు రోజుకు 650 విమానాలను నడిపింది. కానీ కంపెనీ మూసివేసిన సమయానికి సంస్థ వద్ద కేవలం 16 విమానాలు మాత్రమే మిగిలాయి. మార్చి 2019 నాటికి కంపెనీ నష్టం రూ. 5,535.75 కోట్లకు చేరుకుంది. భారీ అప్పుల కారణంగా కంపెనీ 17 ఏప్రిల్ 2019న మూతబడింది.

ఇవీ చదవండి..

Promissory Note: ప్రామిసరీ నోట్ విషయంలో ఇవి తప్పక తెలుసుకోండి.. పాటించకపోతే పైసలు పోవచ్చు..!

Rupee Crash: రికార్డ్ స్ధాయిలో పతనమైన రూపాయి విలువ.. కారణాలు అవే..