HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రుణాలు తీసుకున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్(HDFC Bank) మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ ( MCLR )ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది...
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్(HDFC Bank) మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ ( MCLR )ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది అన్ని రకాల రుణాలపై ప్రభావం చూపుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న వారి ప్రస్తుత ఇఎంఈ పెరుగుతుంది. MCLR అనేది బ్యాంకు వడ్డీ రేటు ఆధారంగా నిర్ణయించబడే వడ్డీ రేటు. ఏ రుణానికైనా(Loan) వడ్డీ రేటు అంతకంటే తక్కువ ఉండకూడదు. ఇంతకుముందు, హెచ్‌డిఎఫ్‌సి అంటే హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఈ నెలలో హోం లోన్లపై వడ్డీ రేటును రెండుసార్లు పెంచింది. హెచ్‌డిఎఫ్‌సి మొదట ఆర్‌పిఎల్‌ఆర్ (రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్లు)ని మొదట 5 బేసిస్ పాయింట్లు, ఆపై 30 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఈ పెరుగుదల తర్వాత, HDFC బ్యాంక్ MCLR 7.15 శాతం నుంచి 7.70 శాతానికి పెరిగింది. అంతకుముందు ఇది 6.90 శాతం నుంచి 7.45 శాతం మధ్య ఉంది. HDFC బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఓవర్‌నైట్ లోన్‌ల కోసం కొత్త MCLR ఇప్పుడు 7.15 శాతానికి పెరిగింది. ఒక నెలకు 7.20 శాతం, మూడు నెలలకు 7.25 శాతం, ఆరు నెలలకు 7.35 శాతంగా ఉంది. 1 సంవత్సరానికి ఇది 7.50 శాతం, 2 సంవత్సరాలకు ఇది 7.60 శాతం, 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి 7.70 శాతం. మే 7 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది.
గత వారం, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) గృహ రుణాలపై వడ్డీ రేటును రెండుసార్లు పెంచింది. గృహ రుణాల కోసం రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR)ని ముందుగా 5 బేసిస్ పాయింట్లు, ఆపై 30 బేసిస్ పాయింట్లు పెంచాలని HDFC నిర్ణయించింది. కొత్త రేటు 9 మే 2022 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు బ్యాంకు కనీస గృహ రుణ వడ్డీ రేటు 7 శాతం, గరిష్ట వడ్డీ రేటు 7.45 శాతం ఉంటుంది. అంతకుముందు మే 1న, HDFC RPLRని పెంచింది.
Read Also.. Google Pay Loan: గూగుల్ పే నుంచి లక్ష వరకు పర్సనల్ లోన్.. సులువుగా ఇలా పొందండి..