Campus Activewear: అనిశ్చితిలోనూ అదిరిపోయే లిస్టింగ్‌.. 29 శాతం జంప్‌ అయిన క్యాంపస్ యాక్టివ్‌వేర్ స్టాక్‌..

సోమవారం క్యాంపస్ యాక్టివ్‌వేర్(Campus Activewear) మార్కెట్‌లో లిస్టయింది. 22 శాతం జంప్‌తో ఈ IPO రూ.355 స్థాయిలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌(BSE)లో లిస్టయింది. దీని ఇష్యూ ధర రూ.292 కాగా షేరు 29 శాతం జంప్‌తో రూ.377కు చేరింది...

Campus Activewear: అనిశ్చితిలోనూ అదిరిపోయే లిస్టింగ్‌.. 29 శాతం జంప్‌ అయిన క్యాంపస్ యాక్టివ్‌వేర్ స్టాక్‌..
Campus
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 09, 2022 | 4:48 PM

సోమవారం క్యాంపస్ యాక్టివ్‌వేర్(Campus Activewear) మార్కెట్‌లో లిస్టయింది. 22 శాతం జంప్‌తో ఈ IPO రూ.355 స్థాయిలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌(BSE)లో లిస్టయింది. దీని ఇష్యూ ధర రూ.292 కాగా షేరు 29 శాతం జంప్‌తో రూ.377కు చేరింది. క్యాంపస్ యాక్టివ్ వేర్ IPO విలువ రూ.1400 కోట్లు. ఈ IPO ఏప్రిల్ 26న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచారు. ఏప్రిల్ 28న ముగిసింది. క్యాంపస్ యాక్టివ్ వేర్ IPO ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.278-292గా నిర్ణయించారు. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ స్టాక్ పెరిగే అన్ని అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ అస్థిరత కొనసాగుతుండడంతో ప్రతి స్టాక్‌పై ఒత్తిడి పెరుగుతుంది.సెకండరీ మార్కెట్‌లో సెంటిమెంట్ చాలా బాగా లేదని జిసిఎల్ సెక్యూరిటీస్ వైస్ ఛైర్మన్ రవి సింఘాల్ అన్నారు. మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బేరిష్‌గా ఉందని. అటువంటి పరిస్థితిలో ఈ స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు.

క్యాంపస్ యాక్టివ్ వేర్ పెట్టుబడికి మంచి స్టాక్ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. ఇందులో దీర్ఘకాలికంగా పెట్టుబడి సలహాలు ఇస్తారు. మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చు తగ్గుల మధ్య, అటువంటి గొప్ప లిస్టింగ్ సంస్థ ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని, వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుందని స్పష్టంగా చూపిస్తుంది. ఇది భారతదేశంలో ప్రసిద్ధ స్పోర్ట్స్ బ్రాండ్. దీని పంపిణీ నెట్‌వర్క్ కూడా చాలా బాగుంది. కంపెనీ వృద్ధికి పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.

Read Also.. Crude Oil: అమెరికా నుండి ముడి చమురు దిగుమతిని తగ్గించిన భారత్.. ఎందుకో తెలుసా..?