Cryptocurrency: తగ్గుతోన్న బిట్‌కాయిన్‌ ధరలు.. 1.57 ట్రిలియన్ డాలర్లకు తగ్గిన గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్..

క్రిప్టో కరెన్సీ(Cryptocurrency) ధరలు సోమవారం పడిపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 1.57 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది....

Cryptocurrency: తగ్గుతోన్న బిట్‌కాయిన్‌ ధరలు.. 1.57 ట్రిలియన్ డాలర్లకు తగ్గిన గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్..
Cripto
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 09, 2022 | 5:19 PM

క్రిప్టో కరెన్సీ(Cryptocurrency) ధరలు సోమవారం పడిపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 1.57 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 2.26 శాతం క్షీణించింది. గత 24 గంటల్లో మొత్తం క్రిప్టో మార్కెట్ పరిమాణం 101.92 బిలియన్ డాలర్లుగా ఉంది. అన్ని స్టేబుల్‌కాయిన్‌ల పరిమాణం ఇప్పుడు $95.73 బిలియన్లుగా ఉంది. బిట్‌కాయిన్ ధర ప్రస్తుతం రూ.27.64 లక్షలు. గత 24 గంటల్లో 1.7 శాతం క్షీణించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్(Capitalization) ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్(Bitcoin) 41.43 శాతంగా ఉంది. ఒక రోజులో ఇది 0.20 శాతం క్షీణతను చవిచూసింది.

అదే సమయంలో, Ethereum ధరలు గత 24 గంటల్లో 2.76 శాతం తగ్గి రూ. 2,02,913కి చేరుకున్నాయి. కాగా, టెథర్ 0.18 శాతం పెరిగి రూ.81.05కి చేరుకుంది. కార్డానో 0.28 శాతం లాభంతో రూ.60 వద్ద ఉంది. మరోవైపు, బినాన్స్ కాయిన్ 1.47 శాతం పతనంతో రూ.28,897.01 వద్ద ట్రేడవుతోంది. XRP క్రిప్టోకరెన్సీ గత 24 గంటల్లో 1.44 శాతం క్షీణతను చూసింది. ఈ క్రిప్టోకరెన్సీ ఇప్పుడు రూ.46.033కి చేరుకుంది. అదే సమయంలో పోల్కాడోట్ 1.06 శాతం క్షీణించి రూ.1,072.28కి చేరుకుంది. కాగా, Dogecoin 0.99 శాతం పతనంతో రూ.10.0200 వద్ద ట్రేడవుతోంది.

Read Also..  LIC IPO: 2.1 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ అయిన ఎల్‌ఐసీ ఐపీఓ.. పెద్దగా ఆసక్తి చూపని విదేశీ పెట్టుబడిదారులు..