AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Promissory Note: ప్రామిసరీ నోట్ విషయంలో ఇవి తప్పక తెలుసుకోండి.. పాటించకపోతే పైసలు పోవచ్చు..!

Promissory Note: ఊళ్లల్లో సహజంగా వడ్డీకి ఇచ్చేటప్పుడు.. ప్రామిసరీ నోట్లు రాయించుకోవటం సర్వ సాధారణం. సదరు ప్రామిసరీ నోట్ల వినియోగంలో ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.

Promissory Note: ప్రామిసరీ నోట్ విషయంలో ఇవి తప్పక తెలుసుకోండి.. పాటించకపోతే పైసలు పోవచ్చు..!
Promissory Note
Ayyappa Mamidi
|

Updated on: May 09, 2022 | 1:19 PM

Share

Promissory Note: ఊళ్లల్లో సహజంగా వడ్డీకి ఇచ్చేటప్పుడు.. ప్రామిసరీ నోట్లు రాయించుకోవటం సర్వ సాధారణం. సదరు ప్రామిసరీ నోట్లపై ఇచ్చే వారి వివరాలు, తీసుకునే వారి వివరాలు, తీసుకున్న మెుత్తం సొమ్ము, వడ్డీ రేటు, సాక్షి సంతకాలు వంటి వివరాలు ఉంటాయి. దీనికి ఒక స్టాంప్ కూడా అంటిస్తారు. దానిపై డబ్బు తీసుకున్న వారు సంతకం లేదా వేలి ముద్ర తీసుకుంటారు. ఇంత వరకూ మనకు తెలిసిందే.. కానీ ప్రామిసరీ నోట్ల విషయంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రామిసరీనోటు వాడుతున్నాం అంటేనే మనకు ఎంతో కొంత అవగాహన ఉండాలి. కనీసం ముఖ్యమైన విషయాలు అయినా సరే తెలియాల్సి ఉంటుంది. కాని అవేమీ తెలియకుండా కొందరు నోటు రాస్తుంటారు, రాయించుకుంటుంటారు. ప్రామిసారి నోటు విషయంలో కీలక విషయం ఏమిటంటే.. దీనిపై గరిష్ఠంగా మీరు కోటి రూపాయల వరకు డబ్బు లావాదేవీలు చేసుకోవచ్చు.

ప్రామిసరీ నోటు అనేది చట్టబద్ధమైనదే. అందువల్ల నిర్భయంగా మనం నగదును వడ్డీకి ఇచ్చే సమయంలో వీటిని వినియోగించవచ్చు. ఇది కోర్టులో కూడా చెల్లుబాటు అవుతుంది. అనుకోని సందర్భంలో కోర్టుకు వెళ్లవలసి వస్తే మీ వద్ద ప్రామిసరీ నోటు జాగ్రత్తగా ఉండటం తప్పని సరి. ఈ ప్రామిసరీ నోటు చెల్లుబాటు కాల పరిమితి కేవలం అందులో రాసుకున్న తేదీ నుంచి మూడు సంవత్సరాలు మాత్రమే. ఒక వేళ మూడు సంవత్సరాల కాలంలో డబ్బు చెల్లింపులు పూర్తి కాకపోతే.. గడువు ముగియక ముందుగానే తిరిగి కొత్త నోటు రాసుకోవాలి. ఈ కాలంలో వడ్డీ, అసలు చెల్లింపులకు సంబంధించిన వివరాలను నోటు వెనుక భాగంలో ఇచ్చిన ఖాళీలో నమోదు చేసుకోవచ్చు. మూడు సంవత్సరాల తరువాత ప్రామిసరీ నోటుకు కాలం చెల్లుతుంది. ఆ తరువాత మీరు దానిని కోర్టుకు తీసుకెళ్లినా ఎటువంటి ఉపయోగం ఉండదు.

ఇవి కూడా చదవండి

3 సంవత్సరాల తర్వాత మాత్రం దానికి కాల దోషం పట్టి నాశనం అయిపోతుంది. మీరు స్వయంగా వెళ్లి నోటు తిరగ రాయించుకొనే అవకాశం లేకపోతే మాత్రం 29 లేదా 30వ నెలలో ఒక లాయర్ నోటీసు ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల కాల దోషం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. నెగోషియాబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం విస్తారమైనది. ప్రామిసరీ నోటుపై స్టాంప్ అంటించే ముందు సంతకం తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల చట్టపరంగా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కోర్టులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేసినప్పుడు మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి కుదురుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Rupee Crash: రికార్డ్ స్ధాయిలో పతనమైన రూపాయి విలువ.. కారణాలు అవే..

Pizza: ఇష్టపడి పిజ్జా ఆర్డర్ చేశాడు.. రెండు ముక్కలు తినగానే గుండె ఆగింది.. ఎందుకంటే..