Rupee Crash: రికార్డ్ స్ధాయిలో పతనమైన రూపాయి విలువ.. కారణాలు అవే..
Rupee Crash: ద్రవ్యోల్బణం ఆందోళనల మధ్య ప్రపంచ ఈక్విటీల్లో నష్టాలను ట్రాక్ చేస్తూ సోమవారం US డాలర్‌తో రూపాయి రికార్డు స్థాయికి చేరుకుంది. కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
Rupee Crash: ద్రవ్యోల్బణం ఆందోళనల మధ్య ప్రపంచ ఈక్విటీల్లో నష్టాలను ట్రాక్ చేస్తూ సోమవారం US డాలర్‌తో రూపాయి రికార్డు స్థాయికి చేరుకుంది. ఉదయం 9.10 గంటలకు హోమ్ కరెన్సీ డాలర్‌కు 77.28 వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి ముగింపు 76.93 నుంచి 0.48 శాతం తగ్గింది. రూపాయి 77.06 వద్ద ప్రారంభమైంది. డాలర్‌తో కనిష్ఠ స్థాయి 77.31కి చేరుకుంది. చివరిసారిగా మార్చి 7, 2022న రూపాయి 76.98 కనిష్ఠాన్ని తాకింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు సరిపోతుందా అంటూ వ్యాపారులు ప్రశ్నించడంతో గ్లోబల్ మార్కెట్లు పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, దాని వడ్డీ రేట్లను పెంచుతున్నప్పుడు మాంద్యం వచ్చే ప్రమాదం గురించి హెచ్చరించింది.
అధిక ముడి చమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనిశ్చితి, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు కొనసాగించిన తర్వాత కూడా కరెన్సీ పతనం కొనసాగుతోంది. దాదాపు 22.31 బిలియన్ డాలర్ల ఈక్విటీలను విక్రయించడంతో ఎఫ్‌ఐఐలు వరుసగా ఏడవ నెలలోనూ నెట్ సెల్లర్స్ గా నిలిచారు. వచ్చే ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం దాని నిర్దేశిత లక్ష్యాన్ని మించిపోతుందనే ఆందోళనల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్ల పెంపును పొడిగించవచ్చు. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 3 బేసిస్ పాయింట్లు పెరిగి 7.484 శాతానికి చేరుకుంది. గత వారం RBI అకస్మాత్తు రేటు పెంపు తర్వాత ఈల్డ్స్ 35 బేసిస్ పాయింట్లకు పైగా పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Pizza: ఇష్టపడి పిజ్జా ఆర్డర్ చేశాడు.. రెండు ముక్కలు తినగానే గుండె ఆగింది.. ఎందుకంటే..
Elon Musk: ఎలాన్ మస్క్ మదిలో చావు భయం.. దీనికి రష్యానే కారణమా..!