Bank Rules: ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలున్నాయా.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే.. లేదంటే?

ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే, వాటి నిర్వహణ ఛార్జీలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు సహా అనేక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకే బ్యాంకులో ఖాతాను ఉంచుకోవాలి.

Bank Rules: ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలున్నాయా.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే.. లేదంటే?
Follow us

|

Updated on: May 09, 2022 | 12:32 PM

ఈ రోజుల్లో చాలామందికి బ్యాంకు(Bank Account)లో ఖాతా ఉండటం చాలా అవసరం. బ్యాంకులో ఖాతా ఉండటం వల్ల ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను ఉంటాయి. అయితే బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఒక ప్రత్యేక విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండి, వాటిని ఉపయోగించకపోతే, మీరు భారీ నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది. అందుకే మనకు అవసరమైన వరకే బ్యాంక్ అకౌంట్లను ఉంచుకొని, మిగతా వాటిని క్లోజ్ చేసుకోవాలి. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే, మీరు అనేక రకాల ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పెట్టుబడి(Investment)తోపాటు, ఐటీఆర్(ITR) కోసం ఒకే ఖాతాను ఉంచుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై లైసెన్స్, ఆర్‌సీ అవసరమే లేదు.. ఈ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు..

ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే, వాటి నిర్వహణ ఛార్జీలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు సహా అనేక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకే బ్యాంకులో ఖాతాను ఉంచుకోవాలి. దీంతో ఒక బ్యాంకుకు మాత్రమే ఛార్జీలు చెల్లిస్తాం. ఇది కాకుండా, మీరు మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు మీ ఖాతా నుంచి లావాదేవీలు చేయకుంటే ఆ ఖాతా అన్ యాక్టివ్‌గా మారుతుంది. ఇది కాకుండా, తరువాత ఈ ఖాతా పనికిరానిదిగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, మినిమం బ్యాలెన్స్ ఛార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. చాలా బ్యాంకుల్లో కనీస నిల్వ రూ. 5000లు కాగా, ఇంకొన్ని బ్యాంకుల్లో రూ.10,000లుగా ఉంటుంది. మీరు బ్యాలెన్స్‌ని దీని కంటే తక్కువగా ఉంచినట్లయితే, మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ CIBIL స్కోర్‌పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు అనవసరమైన ఖాతాలను మూసివేయండి. తద్వారా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఖాతాను మూసివేయడానికి, మీరు D-లింక్ ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. మీరు బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఖాతా క్లోజింగ్ ఫారమ్‌ను తీసుకుని, దాన్ని పూరించాలి. ఆ తర్వాత బ్యాంక్‌లో సమర్పించిన తర్వాత మీ ఖాతా మూసివేస్తారు.

Also Read: Rupee Crash: రికార్డ్ స్ధాయిలో పతనమైన రూపాయి విలువ.. కారణాలు అవే..

Apple Credit Card Payments: క్రెడిట్‌ కార్డుల నుంచి చెల్లింపులను నిలిపివేసిన ఆపిల్‌.. ఎందుకంటే..!