Modi Scheme: మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ మూడు పథకాలకు ఏడేళ్లు పూర్తి.. రూ.312 వార్షిక ప్రీమియంతో రూ.4 లక్షల బెనిఫిట్
Modi Scheme: మోడీ ప్రభుత్వ సామాజిక భద్రతను అందించేందుకు పేదలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అవి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana)..
Modi Scheme: మోడీ ప్రభుత్వ సామాజిక భద్రతను అందించేందుకు పేదలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అవి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana), అటల్ పెన్షన్ యోజన (Pradhan Mantri Atal Pension Yojana) పథకలను ప్రవేశపెట్టి నేటికి ఏడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ పథకాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 9 మే 2015న ప్రారంభించారు. ఈ పథకాలు తక్కువ ధరకు బీమా, సామాజిక భద్రతతో పాటు ప్రజలకు పెన్షన్ ఇవ్వడంలో విజయవంతమయ్యాయి. PMJJBY కింద 12 కోట్ల కంటే ఎక్కువ నామినేషన్లు జరిగాయి. అదే సమయంలో PMSBY కింద మొత్తం 28.37 కోట్లు నమోదు అయ్యాయి. PMJJBY, PMSBY కింద రూ. 312 ప్రీమియంతో రూ. 4 లక్షల వరకు కవరేజీ ఉండేలా ఈ పథకాలను రూపొందించారు. 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గత 7 సంవత్సరాలలో ఈ పథకాల నుండి రిజిస్టర్ చేయబడిన, ప్రయోజనం పొందిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. 15 ఆగస్టు 2014న ప్రధాన మంత్రి ప్రకటించిన ఆర్థిక చేరిక కోసం జాతీయ మిషన్ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇందులో పేద, వెనుకబడిన వర్గాలకు అవసరమైన ఆర్థిక భద్రతను అందించడానికి బీమా, పెన్షన్ కవరేజీని అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ బీమా పథకాలు, గ్యారెంటీ పెన్షన్ పథకాలు గతంలో ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన:
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 12.76 కోట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయని కేంద్ర నివేదికలు వెలువడ్డాయి. అలాగే 5,76,121 క్లెయిమ్‌లకు గాను రూ.11,522 కోట్లు చెల్లించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. PMJJBY సంవత్సరానికి రూ. 330 ప్రీమియంతో 18-50 సంవత్సరాల వయస్సు గల పౌరులకు రూ. 2 లక్షల జీవిత కాలపు కవరేజీని అందిస్తుంది. దీనిని ప్రతి సంవత్సరం పునరుద్ధరించవచ్చు. బ్యాంకు ఖాతా ఉన్న వ్యక్తులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సాధారణ బీమా కంపెనీలతో కలిసి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జీవిత బీమా అందుబాటులో ఉంది. బీమా వ్యవధి జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. కస్టమర్ మే 31లోపు నమోదు చేసుకోవాలి.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన:
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన 9 మే 2015న ప్రారంభించబడిన ప్రమాద బీమా పథకం. ఇది మరణం లేదా పూర్తి/పాక్షిక శాశ్వత వైకల్యానికి బీమా రక్షణను అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం 12 రూపాయలు. 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల బ్యాంకు ఖాతాదారులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది ప్రమాదం, పూర్తి/పాక్షిక శాశ్వత వైకల్యం కారణంగా మరణాన్ని కవర్ చేస్తుంది. ప్రమాదవశాత్తు మరణం, పూర్తి శాశ్వత వైకల్యం అయితే 2 లక్షలు. పాక్షిక శాశ్వత వైకల్యంపై 1 లక్ష లభిస్తుంది. బీమా కాలపరిమితి జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది.
అటల్ పెన్షన్ యోజన (APY):
9 మే 2015న ప్రారంభించబడిన అటల్ పెన్షన్ యోజన దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడంపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. APY అనేది NPS మొత్తం నిర్మాణం కింద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహించబడుతోంది. APY చందాదారుల సహకారంపై ఆధారపడి, 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస పెన్షన్‌కు అందుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 4 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
ప్రీమియంలను నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ-సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. ఎంచుకున్న పెన్షన్ మొత్తం, వ్యక్తి వయస్సు ఆధారంగా కాంట్రిబ్యూషన్ మొత్తం నిర్ణయించబడుతుంది. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల చెల్లుబాటు అయ్యే పొదుపు ఖాతాదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు. ఖాతాదారుడు మరణించిన తర్వాత, జీవిత భాగస్వామికి సమాన పెన్షన్ లభిస్తుంది. ఖాతాదారుడు, అతని/ఆమె జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన సందర్భంలో నామినీకి పూర్తి మొత్తం లభిస్తుంది.
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana, Pradhan Mantri Suraksha Bima Yojana and the Atal Pension Yojana launched on 9th May, 2015, complete 7 years today. pic.twitter.com/mU10nuwdxJ
— PIB India (@PIB_India) May 9, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి