Pashu Credit Card Scheme: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ్యవసాయం కోసం రైతులకు క్రెడిట్‌ కార్డుల పంపిణీ!

Pashu Credit Card Scheme: రాష్ట్రంలోని రైతులకు (Farmers) మేలు చేసేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ ..

Pashu Credit Card Scheme: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ్యవసాయం కోసం రైతులకు క్రెడిట్‌ కార్డుల పంపిణీ!
Follow us
Subhash Goud

|

Updated on: May 09, 2022 | 9:23 AM

Pashu Credit Card Scheme: రాష్ట్రంలోని రైతులకు (Farmers) మేలు చేసేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇక హర్యానా ప్రభుత్వం రైతుల కోసం నిరంతరం కృషి చేస్తోంది. రైతులకు విత్తనం నుంచి పండించిన పంటను మార్కెట్‌ చేరవేసే వరకు అన్ని బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బగవానీ బీమా యోజన (Mukhyamantri Bagwani Bima Yojana), పసల్‌ క్రెడిట్ కార్డ్ (Pashu Credit Card) పథకాలను ప్రారంభించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి జైప్రకాష్ దలాల్ చర్కి-దాద్రీలోని చందవాస్ గ్రామంలో పశుపోషణ కోసం రైతులకు సర్వ హర్యానా గ్రామీణ బ్యాంక్ ( హర్యానా గ్రామీణ బ్యాంక్ ) నుంచి క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 12 గ్రామాలకు చెందిన 325 మంది రైతులకు సుమారు ఐదు కోట్లతో వ్యవసాయం, పశుసంవర్ధక రుణం కార్డులను మంత్రి అందజేశారు.

రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉండాలంటే మంచి దిగుబడి, పాల ఉత్పత్తితోపాటు పశుపోషణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు తదితర వాటిని పెంచుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం రైతులకు రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సకాలంలో రుణం చెల్లించే రైతులకు వడ్డీపై సబ్సిడీ కూడా ఉంటుందని, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఈ కార్డుపై రూ.1.60 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి అంత్యోదయ పరివార్ ఉత్థాన్ యోజన కింద పీకేసీసీ కార్డు ద్వారా ఈ రోజు గరిష్టంగా రుణం అందజేస్తున్నారని అన్నారు.

రైతుల అభ్యున్నతి కోసం పనిచేసే ఏ బ్యాంకు అయినా దాని పురోగతి ఆటోమేటిక్‌గా సాగుతుందని అన్నారు. విత్తనం నుంచి మార్కెట్‌ వరకు రైతు బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ రైతులకు పెద్దపీట వేశారని వివరించారు. రైతుల ప్రతి పొలానికి నీరు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని, ఈ దిశగా పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. 85 శాతం సబ్సిడీపై మైక్రో ఇరిగేషన్ సిస్టమ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫసల్ బీమా యోజన యొక్క ప్రయోజనాలు:

రైతులు పంటల వైవిధ్యంపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఉద్యాన బీమా పథకం కింద పండ్లు, కూరగాయలు పండించే రైతుకు నష్టాలు లేకుండా చేసేందుకు కృషి చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన లేదా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకం ద్వారా రైతులు నష్టపోకుండా కాపాడుతున్నారని అన్నారు. అంతే కాకుండా గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ ప్రభుత్వం రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి