Vijay Devarakonda: ‘అందరికీ నా పుట్టిన రోజు సెంటిమెంట్ అయిపోయింది’.. విజయ్‌ ఆసక్తికర ట్వీట్‌..

Vijay Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. తర్వాత వచ్చిన అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. తనదైన నటన, యాటిట్యూడ్‌తో యూత్‌లో..

Vijay Devarakonda: 'అందరికీ నా పుట్టిన రోజు సెంటిమెంట్ అయిపోయింది'.. విజయ్‌ ఆసక్తికర ట్వీట్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: May 09, 2022 | 4:30 PM

Vijay Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. తర్వాత వచ్చిన అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. తనదైన నటన, యాటిట్యూడ్‌తో యూత్‌లో ఎక్కడలేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ‘రౌడీ వేర్‌’ బ్రాండ్‌ పేరుతో బిజినెస్‌లోకి కూడా అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లైగర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా కూడా మారాడు విజయ్‌. ఇలా టాలీవుడ్‌లో తక్కువ సమయంలో ఎక్కుల పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ పుట్టిన రోజు నేడు (సోమవారం).

ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా విజయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక విజయ్‌ బర్త్‌డేను పురస్కరించుకొని లైగర్‌ మూవీ టీం సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేసింది. సోమవారం సాయంత్రం లైగర్‌ మూవీ నుంచి ఓ అప్‌డేట్‌ను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే తన పుట్టిన రోజున విజయ్‌ చేసిన ఓ ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయమై విజయ్‌ ట్వీట్ చేస్తూ.. ‘నా పుట్టిన రోజున చాలా ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈరోజు ఫెస్టివల్‌ రోజుగా మారిపోయింది. అందరికీ విజయ్‌ దేవరకొండ బర్త్‌డే సెంటిమెంట్ ఎక్కువ అయిపోయింది. అన్ని సినిమాలు బాగా ఆడాలి’ అంటూ రాసుకొచ్చారు. ఇక సోమవారం లైగర్‌, మేజర్, ఎఫ్‌3, అంటే సుందరానికి, సమంత-విజయ్‌ మూవీ, ప్రృథ్విరాజ్‌ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఈరోజే విడుదల చేస్తుండడం విశేషం.