Kollywood: పాన్ ఇండియా సినిమాల వైపు చూడని తమిళ తంబీలు.. కారణం ఏమైవుంటుందబ్బా..!!
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. మిగతా ఇండస్ట్రీలన్నీ రీజినల్ మార్కెట్‌కే పరిమితం. కానీ ఒక్క బాహుబలి సినిమాతో లెక్కలు మార్చేశారు రాజమౌళి
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. మిగతా ఇండస్ట్రీలన్నీ రీజినల్ మార్కెట్‌కే పరిమితం. కానీ ఒక్క బాహుబలి సినిమాతో లెక్కలు మార్చేశారు రాజమౌళి. ఇండియన్ సినిమాగా ప్రూవ్ చేసుకునే సత్తా డౌన్ సౌత్‌లోనూ ఉందని ఇంటర్నేషనల్ లెవల్‌లో గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. ఒక్కసారిగా నార్త్ ఇండియా అంతా సౌత్ వైపు చూసేలా చేశారు. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో మాహిష్మతి సామ్రాజ్యమే కాదు.. సౌత్ సినిమా కూడా ఊపిరి పీల్చుకుంది. తెలుగు, కన్నడ అనే తేడా లేకుండా కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు చేసుకున్న ప్రతి సినిమా ప్యాన్ ఇండియా కలెక్షన్లనే ఎయిమ్ చేస్తోంది.
నిన్న మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్న పరిశ్రమ. లోకల్‌గా క్వాలిటీ సినిమాలు రాకపోవటంతో అదర్ లాంగ్వేజ్ సినిమాలను కూడా ఎంతగానో ఆదరించే వారు అక్కడి ప్రేక్షకులు. కానీ అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు నేషనల్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. రాకీభాయ్ మేనియా నార్త్ సర్కిల్స్‌లో రచ్చ చేస్తోంది. మలయాళ ఇండస్ట్రీ కూడా మేమేం తక్కువ కాదని పదే పదే ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తోంది. భారీ స్టార్ కాస్ట్‌తో పాటు భారీ బడ్జట్‌తో మరక్కర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించి రిలీజ్ చేశారు. అంతేకాదు మీడియం బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలను కూడా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు మలయాళ సినీ జనాలు. ఇలా అన్ని ఇండస్ట్రీలు నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తుంటే.. తమిళ హీరోలు మాత్రం మా రూటు సెపరేటు అంటున్నారు. ఆల్రెడీ మార్కెట్ ఉంది కదా.. మొక్కుబడిగా మల్టీ లింగ్యువల్ రిలీజ్ చేస్తున్నా.. పాన్ ఇండియా వైపు సీరియస్ చూస్తున్న దాఖలాలైతే కనిపించటం లేదు.
తమిళ ఇండస్ట్రీలోనూ కోట్లు కురిపించే హీరోలు చాలా మందే ఉన్నారు. విజయ్, అజిత్ లాంటి హీరోలు రీజినల్ మార్కెట్‌లోనే రికార్డ్ వసూళ్లు సాధిస్తున్నారు. మాస్ ఫాలోయింగ్ విషయంలో తిరుగులేదనే రేంజ్లో ఉన్న ఈ హీరోలు కూడా నార్త్ ఇండస్ట్రీల వైపు చూడటం లేదు. తమిళ జనాలను టార్గెట్ చేస్తూనే సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో వర్సటైల్ స్టార్స్ కూడా చాలా మందే ఉన్నారు. విక్రమ్ లాంటి హీరోలు పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలు దశాబ్దాల కిందటే చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సూర్య చేస్తున్న సినిమాల రీమేక్ హక్కుల కోసం నార్త్ హీరోలు క్యూ కడుతున్నారు. ఎట్ ఎ టైమ్ తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలను రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నా, కోలీవుడ్ స్టార్స్ మాత్రం హిందీ బెల్ట్ ని కేప్చర్ చేయాలనే ప్రయత్నాలు చేయట్లేదు. ఈ విషయంలో ధనుష్ కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. పాన్ ఇండియా సెగ్మెంట్‌లోకి రాకపోయినా.. బాలీవుడ్‌తోనూ మంచి రిలేషన్ మెయిన్ టైన్ చేస్తున్నారు ధనుష్. తమిళ నాట స్టార్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు.