AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy 66 : దళపతి సినిమాలో సహజ నటి.. విజయ్ 66లో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్

దళపతి విజయ్ రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

Thalapathy 66 : దళపతి సినిమాలో సహజ నటి.. విజయ్ 66లో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్
Thalapathy 66
Rajeev Rayala
|

Updated on: May 09, 2022 | 6:43 PM

Share

దళపతి విజయ్(Thalapathy Vijay) రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తమిళ్ లో పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం నిరాశపరిచింది. దాంతో విజయ్ నటించనున్న నెక్స్ట్ సినిమా పై ఆసక్తి పెరిగింది విజయ్ ఫ్యాన్స్ కి. ఓ సాలిడ్ హిట్ కావాలంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. విజయ్ తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చేస్తున్న విషయం తెలిసిందే. వంశీ మహర్షి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమాలో దళపతికి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుంది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిచనున్నారు.

ఇక ఈ సినిమాలో తాజాగా సీనియర్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నారని చెప్పేశారు. సహజ నటి జయసుధ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని ప్రకటించారు మేకర్స్. ఇటీవల జయసుధ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. వందల సినిమాల్లో జయసుధ తల్లి పాత్రలు నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు దళపతి సినిమాలో జయసుధ నటించే పాత్ర పై ఆసక్తి నెలకొంది. జయసుధ తో పాటు ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం వంశీ ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేశారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారని సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై.