Liger: గర్జించిన లైగర్.. అదిరిపోయిన థీమ్ సాంగ్.. మతిపోగొడుతున్న విజయ్ మేకోవర్

రౌడీ బాయ్ విజయ్ దేవర కొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో.

Liger: గర్జించిన లైగర్.. అదిరిపోయిన థీమ్ సాంగ్.. మతిపోగొడుతున్న విజయ్ మేకోవర్
Liger
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2022 | 4:29 PM

రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ(Vijay Deverkonda)కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టి హీరోగా పరిచయం అయిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి గా అదరగొట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి విజయ్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆ తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రేడ్‌, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. ఇక ఇప్పుడు లైగర్‌గా గర్జించడానికి రెడీ అవుతున్నాడు ఈ రౌడీ బాయ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న పవర్ ఫుల్ మూవీ లైగర్. ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్‌తో రొమాన్స్ చేయనుంది. ఇప్పటికే 70 శాతంకు పైగా లైగర్ సినిమా షూటింగ్ జరుపుకుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌కు.. అనన్య టాలీవుడ్‌కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా లైగర్ టీమ్ విజయ్ బర్త్ డే స్పెషల్‌గా థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ముంబై లోని ఓ చాయ్ వాలా బాక్సర్‌గా ఎలా ఎదిగాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేవి సినిమాలో చూపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , గ్లిమ్ప్స్ సినిమా అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. తాజాగా విడుదలైన థీమ్ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.. ఈ రోజు నుంచి లైగర్ వేట మొదలవుతుంది అంటూ హింట్ ఇచ్చారు మేకర్స్. ఇవీ నా మార్నింగ్ థాట్స్ అంటూ ఎమోషనల్ లైన్స్‌తో ఇవాళ ఉదయమే లైగర్ థీమ్‌ సాంగ్‌ని ఫ్యాన్స్‌కి డెడికేట్ చేస్తున్నట్టు చెప్పారు విజయ్ దేవరకొండ. ఆగస్టు 25న రిలీజ్ కాబోతోంది లైగర్ మూవీ. టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచి మొనీమధ్య వచ్చిన గ్లింప్స్‌ దాకా అన్నీ సినిమాకు క్రేజ్ పెంచే మూమెంట్సే. ఇక ఈ మధ్య బైటికొస్తున్న ప్రీ -రిలీజ్ బిజినెస్ లెక్కలైతే లైగర్‌ స్టామినాకు శాంపిల్‌పీసెస్‌గా మారాయి. లైగర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా 65 కోట్లకు అమ్ముడయ్యాయన్నది టాక్. ఓటీటీ హిస్టరీలో ఇదొక అండర్‌లైన్ చేసుకోదగ్గ డీల్ అట. ఇక థియేటర్ బిజినెస్ ఏ రేంజ్‌లో వుంటుందన్న అంచనాలు ఇండస్ట్రీలో జోరుగా షురూ అయ్యాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..