Sai Pallavi: ‘చరిత్రలో నిలిచిపోయే ప్రేమ తనది’.. విరాట పర్వం నుంచి ‘సోల్ ఆఫ్ వెన్నెల’
ప్రేమమ్ సినిమాతో అందరిని తన ప్రేమలో పడేసిన సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.తెలుగులో తొలి సినిమాతోనే మన పక్కింటి అమ్మాయి అన్న మార్క్ ను సంపాధించింది.
ప్రేమమ్ సినిమాతో అందరిని తన ప్రేమలో పడేసిన సాయి పల్లవి(Sai Pallavi).. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. తెలుగులో తొలి సినిమాతోనే మన పక్కింటి అమ్మాయి అన్న మార్క్ ను సంపాధించింది. తనదైన సహజ నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది సాయి పల్లవి. నేడు ఈ చూడచక్కని భామ పుట్టిన రోజు. ముద్దుగుమ్మ సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు పలువురు సినిమా తారలు విషెస్ తెలుపుతున్నారు. ఇక ఈ చిన్నది నటించిన సినిమాలనుంచి క్రేజీ అప్డేట్స్ కూడా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే సాయి పల్లవి నటిస్తున్న కొత్త సినిమా గార్గి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమానుంచి సాయి పల్లవి పోస్టర్ ను విడుదల చేశారు.
వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి భావజాలను ఇష్టపడి.. అతడిని ప్రేమించే యువతి వెన్నెలగా సాయి పల్లవి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్, ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సాయి పల్లవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘వెన్నెల రెండుసార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు అడవి తల్లి ఒడిలో ఒకసారి.. ఆశయాన్ని ఆయుధం చేసినట్టు అతని ప్రేమలో మరొకసారి’ అంటూ వాయిస్ ఓవర్ తో ఈ వీడియో ఉంది. ఈ వీడియోను హీరో రానా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చరిత్రలో నిలిచిపోయే ప్రేమ తనది ❤️? Presenting #SoulOfVennela from #VirataParvam.
– https://t.co/p5H2Lkxpk8#HBDSaiPallavi ♥ #VirataParvamOnJuly1st
@Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @laharimusic @SLVCinemasOffl @SureshProdns pic.twitter.com/JLEyV9mgvO
— Rana Daggubati (@RanaDaggubati) May 9, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :