AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Raisins: నల్ల ఎండు ద్రాక్షతో అద్భుత ప్రయోజనాలు.. రక్త హీనత, గుండె సమస్యలకు చక్కటి పరిష్కారం..

Black Raisins Benefits: నల్ల ఎండుద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Black Raisins: నల్ల ఎండు ద్రాక్షతో అద్భుత ప్రయోజనాలు.. రక్త హీనత, గుండె సమస్యలకు చక్కటి పరిష్కారం..
Black Raisins Benefits
Basha Shek
|

Updated on: May 09, 2022 | 6:38 PM

Share

Black Raisins Benefits: ఎండు ద్రాక్షలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తుంటారు. అందుకు తగ్గట్లే మార్కెట్లో వివిధ రకాల ఎండు ద్రాక్షలు మనకు లభిస్తుంటాయి. అందులో నల్ల ఎండుద్రాక్షలు (Black Raisins) కూడా ఉంటాయి. నల్ల ద్రాక్షనుండే వీటిని తయారుచేస్తుంటారు. ఎంతో రుచిగా ఉండే వీటిని వివిధ రకాల వంటకాలు, డెజర్ట్, స్మూతీస్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ ఎండుద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నల్ల ఎండు ద్రాక్షలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే..

ప్రొటీన్ పుష్కలంగా..

ఇవి కూడా చదవండి

నల్ల ఎండుద్రాక్షలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు, ఎముకలను బలంగా మారుస్తుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

కళ్లకు మేలు ..

నల్ల ఎండుద్రాక్షలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, ఇతర యాంటీఆక్సిడెంట్లు వంటి బ్లాక్ రైసిన్‌లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్లు కళ్లకు చాలా మేలు చేస్తాయి. ఇవి కళ్లకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి కళ్లను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే కంటి శుక్లాలు వంటి సమస్యలను తగ్గిస్తాయి. నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయాన్నే తీసుకుంటే కంటి చూపు బాగా మెరుగవుతుంది.

రక్తహీనత దూరం..

నల్ల ఎండుద్రాక్షలో ఐరన్‌, విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇతర పండ్లు, కూరగాయల కంటే నల్ల ఎండుద్రాక్షలోనే ఐరన్‌ అధికంగా ఉంటుంది. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

జుట్టును బలంగా..

నల్ల ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా ఐరన్, విటమిన్లు, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.

రక్తపోటును నియంత్రిస్తుంది

నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

గుండెకు మేలు..

చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారు నల్ల ఎండు ద్రాక్షను ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని ఫైబర్, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు చెడు కొలెస్ట్రాల్, కొవ్వులను కరిగిస్తాయి. గుండె జబ్బులు ప్రమాదం నుంచి రక్షణ కలిగిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Sai Pallavi: న్యాచురల్‌ బ్యూటీ బర్త్‌ డే స్పెషల్‌.. గార్గిగా రానున్నసాయి పల్లవి.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌ లుక్‌..

High Blood Pressure Diet: అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే..

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీపై మండిపడుతోన్న నెటిజన్లు.. డబ్బు కోసం అలా ఎలా చేస్తావంటూ ట్రోలింగ్‌..