India Covid-19: గుడ్‌న్యూస్‌.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..

శనివారంతో పోల్చుకుంటే 919 కేసులు తగ్గాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 10 మంది మరణించారు.

India Covid-19: గుడ్‌న్యూస్‌.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..
Coronavirus In India
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 10, 2022 | 9:48 AM

India Coronavirus Updates: భారత్‌లో కరోనావైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో (సోమవారం) కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 2,288 కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చుకుంటే 919 కేసులు తగ్గాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 10 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 19,637 (0.05 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

దేశంలో నమోదైన కేసులు, రికవరీ వివరాలు..

ఇవి కూడా చదవండి
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,07,689 కి చేరింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,24,103 కి పెరిగింది.
  • నిన్న కరోనా నుంచి 3,044 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,63,949 కి చేరింది.
  • ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతం ఉంది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 190,50,86,706 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 13,90,912 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

Also Read: Viral Video: వామ్మో.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. రెండు ముక్కలైన ట్రాక్టర్ ఇంజిన్.. షాకింగ్ వీడియో..