GGH Hospital: ఆడుతూ.. పాడుతూ.. ఆసుపత్రికి వచ్చింది.. వైద్యుల నిర్లక్ష్యంతో అలా మిగిలింది..!

GGH Hospital Eye surgery: శుక్రవారం ఆసుపత్రికి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. గురువారం ఆసుపత్రికి వచ్చిన ఆరాధ్యను ఇన్ పేషెంట్ విభాగంలో చేర్చారు. శనివారం ఆపరేషన్ చేస్తామన్నారు. పది నిమిషాల్లో ఆపరేషన్ అయిపోతుందని..

GGH Hospital: ఆడుతూ.. పాడుతూ.. ఆసుపత్రికి వచ్చింది.. వైద్యుల నిర్లక్ష్యంతో అలా మిగిలింది..!
Ggh Guntur Hospital
Follow us
Sanjay Kasula

|

Updated on: May 10, 2022 | 1:56 PM

ఐదేళ్ళ చిన్నారి ఆరాధ్య… ఆరాధ్యకు కంటిపై కురుపు వచ్చింది‌. కురుపును గమనించిన తల్లిదండ్రులు పావని, ఏడుకొండలు వైద్యం చేయించాలని నిర్ణయించుకొన్నారు. గుంటూరులోని అంకిరెడ్డి పాలెం కు చెందిన దంపతులు కోర్టు సముదాయం వద్ద జిరాక్స్ షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఆరాధ్య కంటిపై వచ్చింది చిన్న కురుపే కావడంతో జీజీహెచ్ లో(GGH Hospital) వైద్యులకు సోమవారం అవుట్ సేషెంట్ విభాగంలో చూపించారు. కురుపును పరిశీలించిన వైద్యులు శుక్రవారం ఆసుపత్రికి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. గురువారం ఆసుపత్రికి వచ్చిన ఆరాధ్యను ఇన్ పేషెంట్ విభాగంలో చేర్చారు. శనివారం ఆపరేషన్ చేస్తామన్నారు. పది నిమిషాల్లో ఆపరేషన్ అయిపోతుందని వెంటనే ఇంటికి తీసుకెళ్ళ వచ్చని చెప్పారు. అయితే శని వారం ఆపరేషన్ పూర్తయిన తర్వాత పాప పరిస్థితి విషమిచ్చింది. ఏకంగా వెంటిలేటర్ పై ఉంచారు. రెండు రోజుల తర్వాత కూడా పాప ఆరోగ్య పరిస్థితిపై మార్పు లేదు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. తమ పాపకు ఏంజరిగిందో చెప్పాలని వైద్యులను నిలదీశారు. అంతా బాగుందంటూనే ఎందుకు హాడావుడి చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆపరేషన్ తర్వాత పాప పరిస్థితి విషమిచ్చిందని ఆపరేషన్ ముందు ఏమైనా ప్రాబ్లెమ్స్ ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

దీంతో వైద్యులపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుకుంటూ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిన చావు బ్రతుకుల మధ్యకు ఎలా వెళ్ళిందో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి విడదల రజిని మెరుగైన వైద్యం చేయాలని ఆదేశించారు. దీంతో తల్లిదండ్రులు కోరిక మేరకు రమేష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.

అయితే పాప తిరిగి వస్తుందో రాదోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఏపీ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: Cyclone Asani Live Updates: ఉత్తరాంధ్రలో అసని అలజడి.. ఉప్పాడ సముద్ర తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..

Hyderabad: ప్రేమ జంట రిజిస్ట్రేషన్ మ్యారేజ్.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..