Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prostitution Racket: హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులకు షాక్‌.. టాయిలెట్‌లో రహస్య గదులు.. టైల్స్ మాటున అసలు యవ్వారం..

Chitradurga Prostitution Racket: టాయిలెట్‌లో(Toilet) రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో..

Prostitution Racket: హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులకు షాక్‌.. టాయిలెట్‌లో రహస్య గదులు..  టైల్స్ మాటున అసలు యవ్వారం..
Chitradurga prostitution racket
Follow us
Sanjay Kasula

|

Updated on: May 10, 2022 | 8:17 AM

యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివాం. ఐటీ రైడ్‌లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్‌ గదుల్లోనూ, వాటర్‌ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ.. టాయిలెట్‌లో(Toilet) రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం(Chitradurga prostitution racket) చేస్తున్నట్లు పక్కా స‌మాచారం అందుకుని స్పెషల్‌ టీం రైడ్‌కు వెళ్లింది.

అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్‌రూమ్‌ను పరిశీలించగా ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది. అదే వాళ్లకు క్లూ అయింది. శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారి.. టైల్స్‌ నుంచి వస్తున్నట్టు గమనించాడు. అనుమానంతో టైల్స్‌పై చెయ్యి వేయగానే అది కాస్త పక్కకు జరిగింది.

దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది.

ట్రెండింగ్ న్యూస్..

ఇవి కూడా చదవండి: Cyclone Asani Live Updates: ఉత్తరాంధ్రలో అసని అలజడి.. ఉప్పాడ సముద్ర తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..

Hyderabad: ప్రేమ జంట రిజిస్ట్రేషన్ మ్యారేజ్.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..