Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్టాక్ మార్కెట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి.. నష్టాలను తప్పించుకునేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Stock Market: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే(Investing) భారీగా సంపాదించవచ్చని అనుకునేవారు కొంతమందైతే, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వచ్చనే భ్రమలో ఉండేవారు చాలా మందే. నష్టాల నుంచి తప్పించుకునేందుకు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.

Stock Market: స్టాక్ మార్కెట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి.. నష్టాలను తప్పించుకునేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 10, 2022 | 7:51 AM

Stock Market: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే(Investing) భారీగా సంపాదించవచ్చని అనుకునేవారు కొంతమందైతే, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వచ్చనే భ్రమలో ఉండేవారు చాలా మందే. కరోనా తరువాత చాలా మంది కొత్తగా మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ల గురించి ఎలాంటి అవగాహన లేకుండానే ట్రేడింగ్(Trading) ప్రారంభిస్తారు. తీరా నష్టాలు వచ్చాక స్టాక్ మార్కెట్ల గురించి చెడు అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. అసలు కొత్తగా ట్రేడింట్ చేద్దామనుకునేవారు తీసుకోవలసి జాగ్రత్తలు ఏమిటి. ఎలాంటి పద్ధతులను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా.. కనీసం కొంత పరిజ్ఞానం అవసరం. మార్కెట్లు ఎలా పనిచేస్తాయి, దేని వల్ల ప్రభావితం అవుతాయి, ఇతర మార్కెట్ల ప్రభావం ఎలా ఉంటుంది వంటి అనేక కారణాలు తెలుసుకోవాలి. ట్రేడింగ్ చేసేందుకు కొంత టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం. కానీ.. ఇవేవీ తెలుసుకోకుండా చాలా మంది మార్కెట్లలో లాభాలు వస్తాయనుకుని ట్రేడింగ్ ప్రారంభిస్తుంటారు. దానిని డబ్బు సంపాదించేదుకు ఉన్న ఒక జూదం లాగా భావిస్తుంటారు. ఇలా వచ్చే వారందరూ భారీ నష్టాలను పొందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నేర్చుకున్నది ప్రణాళికాబద్ధంగా అమలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సాధించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే.. పెట్టుబడి మెుత్తాన్ని రక్షించుకోవటం. లాభాల సంగతి పక్కన పెడితే ముందుగా మూలధనాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మార్కెట్లో దీర్ఘకాలంలో నిలబడగలుగుతారు. మార్కెట్లో ఇతరులు అందించే పెయిడ్ సలహాలు, సూచనలు పాటించకపోవటం మంచిది. నష్టాలు వచ్చినప్పుడు వాటిని పూడ్చుకునేందుకు చాలా మంది అప్పులు చేసి ట్రేడ్ చేస్తుంటారు. ఇలాంటి రివెంజ్ ట్రేడింగ్ అస్సలు మంచిది కాదు. ఇలాంటి వాటి వల్ల తీవ్రంగా కోలుకోలేని నష్టాలు చవిచూడవచ్చు.

అందువల్ల ట్రేడింగ్ కు అవసరమైన విద్యలు సొంతంగా నేర్చుకుని సాధించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ట్రేడ్/స్టాక్ నుంచి అద్భుత లాభాలు ఆశించడం సరైనది కాదు. అసాధ్యం కాదు అలా అని సుసాధ్యం కాదు. లాభం వచ్చినపుడు అత్యాశకు పోవటం, నష్టం వస్తే డీలా పడటం కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. స్టాక్ బ్రోకర్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. విశ్వసనీయ స్టాక్ బ్రోకర్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Twitter: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం వెలుగులోకి..

Free OTT Plans: అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో..!