Free OTT Plans: అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో..!

OTT Plans: దేేశీయ టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోలు యూజర్లకు బంపరాఫర్ ప్రకటించాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ ను ఉచితంగా వీక్షించేందుకు వీలుగా ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి.

Free OTT Plans: అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో..!
Ott Plans
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 10, 2022 | 6:43 AM

OTT Plans: దేేశీయ టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోలు యూజర్లకు బంపరాఫర్ ప్రకటించాయి. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్లను ఉచితంగా వీక్షించేందుకు వీలుగా కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్‌టెల్‌, జియోలు అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్‌లతో క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్‌ మ్యాచ్‌లు, మూవీస్‌, షోస్‌తో పాటు న్యూస్‌ను ఫ్రీగా చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం టెలికాం సంస్థలు తెచ్చిన ప్లాన్‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..

రిలయన్స్ జియో ప్లాన్స్ ఇలా..

రిలయన్స్ జియో ఇప్పటికే రూ.2999, రూ.1066, రూ.799, రూ.4199,రూ.601 ప్లాన్‌లపై డిస్నీ ప్లస్‌ హాట్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుండగా తాజాగా మరికొన్ని ప్లాన్‌లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. జియో రూ.151 ప్లాన్‌లో యూజర్లు కేవలం ఇంటర్నెట్‌ డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తం 8జీబీ డేటాతో పాటు అదనంగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులో ఉంటుంది. జియో రూ.333 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌క్లకు అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5జీబీ రోజువారీ డేటాను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. జియో రూ.583 జియో నుంచి 3వ కొత్త డిస్నీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. జియో రూ.783 ప్లాన్ 84రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.5జీబీ డేటా, ఫ్రీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌ టెల్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ప్లాన్స్..

ఎయిర్‌టెల్ రూ.399, రూ.839 విలువైన డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ లను అందిస్తోంది. ఇది మూడు నెలల డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఒక నెల ఉచిత అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24*7 సర్కిల్ లను వినియోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ రూ.839 ప్లాన్ 84రోజుల వ్యాలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు, 3నెలల ఫ్రీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌ టెల్‌ ఎక్స్‌ ట్రీమ్‌ మొబైల్ ప్యాక్, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాల్ని పొందేందుకు వెసులుబాటును ఎయిర్ టెల్ కల్పించింది.

ఇవీ చదవండి..

Sri Lanka Crisis: శ్రీలంకలో దారుణ పరిస్థితులు.. రాజకీయ నాయకుల ఇళ్లని తగలబెడుతున్న ఆందోళనకారులు..

Ukraine-Russia War: పశ్చిమ దేశాలకు ప్రతి చర్యగానే ఉక్రెయిన్ పై యుద్ధం.. “విక్టరీ డే” లో పుతిన్ కీలక వ్యాఖ్య