- Telugu News Photo Gallery RBI imposed penalty of Rs 58 lakh on Abhyudaya Co operative Bank Mumbai for non compliance with several directions
RBI Penalty: ఈ రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. నిబంధనలు పాటించడం లేదని భారీ జరిమానా
RBI Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. ముంబైలోని ఓ సహకార బ్యాంకుకు ..
Updated on: May 10, 2022 | 7:06 AM

RBI Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. ముంబైలోని ఓ సహకార బ్యాంకుకు రూ.58 లక్షల జరిమానా విధించింది ఆర్బీఐ. ముంబైకి చెందిన అభ్యుదయ కో-ఆపరేటివ్ బ్యాంక్ (Abhyudaya Co operative Bank) ఆర్బీఐ ఆదేశాలు పాటించడం లేదని ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది.

ఎన్‌పీఏలకు సంబంధించిన నిబంధనలను కూడా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ అభ్యుదయ సహకార బ్యాంకుకు ఈ జరిమానా విధించింది. అయితే ఇది బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రభావితం చేయదని ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లకు సంబంధించిన అన్ని సేవలు కొనసాగుతాయి.

ఢిల్లీ NCRలో ఉన్న నోయిడా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ ఘజియాబాద్‌పై కూడా ఇదే విధమైన చర్య తీసుకుంది. ఈ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ రూ.లక్ష జరిమానా విధించింది. నోయిడా కో-ఆపరేటివ్ బ్యాంక్ డివిడెండ్ చెల్లింపుకు సం

రెగ్యులేటరీ నిబంధనలలో అలసత్వం కారణంగా బ్యాంకులకు జరిమానా విధించామని, దీని వల్ల బ్యాంకింగ్ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఖాతాదారులకు బ్యాంక్ అందించిన అన్ని సేవలు కొనసాగుతాయని తెలిపింది. ఈ చర్య వల్ల ఎలాంటి లావాదేవీలు ప్రభావితం కావని ఆర్బీఐ వెల్లడించింది.





























