Robin Uthappa: రాబిన్ ఊతప్ప ఇంటికి మరో లిటిల్ గెస్ట్.. ఫొటో షేర్ చేసిన భార్య..!
Robin Uthappa: భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రస్తుతం ఐపీఎల్ 2022లో బిజీగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈసారి లీగ్‌లో చెన్నై పరిస్థితి బాగా లేదు.
Updated on: May 10, 2022 | 6:45 AM

భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రస్తుతం ఐపీఎల్ 2022లో బిజీగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈసారి లీగ్‌లో చెన్నై పరిస్థితి బాగా లేదు. ధోని మళ్లీ కెప్టెన్‌గా మారి చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుస విజయాలని సాధిస్తున్నారు. ఈ సీజన్‌లో ఉతప్ప కూడా బాగానే ఆడుతున్నాడు. వీటన్నిటి మధ్య ఉతప్ప భార్య శీతల్ ఉతప్ప ఒక ఫోటో షేర్ చేసి గొప్ప సమాచారాన్ని అందించింది.

ఉతప్ప భార్య శీతల్ మరో బిడ్డకు జన్మనివ్వనుంది. సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసి తన గర్భం గురించి తెలియజేసింది. ఉతప్ప, శీతల్‌లకు ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు.

శీతల్ కూడా క్రీడాకారిణి. ఆమె వృత్తిరీత్యా టెన్నిస్ క్రీడాకారిణి. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పేర్కొంది. ఆమె తొమ్మిదేళ్ల వయస్సు నుంచి టెన్నిస్ ఆడుతుంది. 33 సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్ ప్రకటించింది.

రాబిన్ ఊతప్ప ఆమెని కాలేజీలో కలిసాడు. అక్కడ ఆమె అతని సీనియర్. ఇద్దరూ ఆటగాళ్లు కాబట్టి స్నేహం మరింత బలపడింది. 2016 మార్చి 3న పెళ్లి చేసుకున్నారు.

ఈ సీజన్‌లో రాబిన్ ప్రదర్శన గురించి మాట్లాడితే.. అతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడాడు. 229 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 22.90. ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.





























