Adani Green: అద్బుతాలు సృష్టిస్తున్న అదానీ గ్రీన్ స్టాక్.. మార్కెట్ క్యాప్ లో SBIని వెనక్కి నెట్టిన సంస్థ..
Adani Green: అదానీ గ్రూప్ లోని అనేక కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా తమ మార్కెట్ విలువను భారీగా పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అదానీ విల్మర్ లాంటి స్టాక్స్ ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందిస్తున్నాయి.
Adani Green: అదానీ గ్రూప్ లోని అనేక కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా తమ మార్కెట్ విలువను భారీగా పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అదానీ విల్మర్ లాంటి స్టాక్స్ ఐపీవో లిస్టింగ్ నుంచి ఇప్పటి వరక మల్టీ బ్యాగర్ రిటర్న్స్(Multibagger Returns) అందించి పెట్టుబడి పెట్టిన వారికి కనక వర్షం కురిపించాయి. అదానీ గ్రూప్‌లోని(Adani Group) చాలా షేర్లు ఈ ఏడాది మంచి ఫలితాలను నమోదు చేసి, మార్కెట్లో చక్కటి రిటర్న్స్ అందిస్తున్నాయి. తాజాగా.. రెన్యువబుల్ ఎనర్జీ వ్యాపారమైన అదానీ గ్రీన్ కూడా ఈ జాబితాలో చేరింది. దాదాపు నెల రోజుల క్రితమే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల జాబితాలో అదానీ గ్రీన్స్ చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మరో మైలురాయిని నమోదు చేసింది. అదానీ గ్రీన్ నిఫ్టీ- 50లో మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థల్లో 7వ స్థానానికి చేరుకుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీ గ్రీన్స్ తరువాతి స్థానంలో నిలిచింది.
ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ. 4,32,263 కోట్లుగా ఉండగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ మార్కెట్ క్యాప్ మాత్రం ప్రస్తుతం రూ. 4,49,255 కోట్లకు చేరుకుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడిదారులకు అదానీ గ్రీన్ స్టాక్ ప్రాధాన్యత కలిగిన స్టాక్‌గా మారడంతో అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ అనేక రెట్లు పెరిగింది. అదానీ గ్రీన్ షేర్లు 2022లో మల్టీబ్యాగర్ స్టాక్స్ లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఏడాదికి దాదాపు 110 శాతం రాబడిని అందించింది. గడచిన ఆరు నెలల కాలంలో.. ఈ కంపెనీ ఐటీసీ, ఎయిర్ టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ కంపెనీల మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. బిగ్ బాయ్స్ క్లబ్‌లోకి ప్రవేశించిన మొదటి నాన్-నిఫ్టీ- 50 కంపెనీ ఇదే కావటం విశేషం.
గత ఒక నెలలో అదానీ గ్రీన్ షేర్ దాదాపు రూ. 2665 నుంచి రూ. 2856 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 7 శాతం లాభపడింది. సంవత్సర కాల వ్యవధిలో.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ. 1350 నుంచి రూ. 2856 స్థాయికి ఎదిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ కంటే పైన స్థానాల్లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, TCS, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, HUL, ICICI బ్యాంక్ ఆరు స్థానాల్లో నిలిచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Free OTT Plans: అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో..!