AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking Rules: బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక నుంచి లోన్ చెల్లించకపోతే ఇబ్బందే..

రుణాలకు సంబంధించి త్వరలో ఆర్బీఐ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం కఠిన నియమాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కస్టమర్ రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని పక్షంలో బ్యాంకులు పాటించాల్సిన పద్దతులు, వేరే లోన్ మళ్లీ జారీ చేయడంకు సంబంధించి కొత్త నిబంధనలు రానున్నాయి.

Banking Rules: బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక నుంచి లోన్ చెల్లించకపోతే ఇబ్బందే..
Banking News
Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 12:24 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకింగ్ రూల్స్‌ను తీసుకురానుంది. బ్యాంకులు కస్టమర్లకు లోన్లు మంజూరుకు సంబంధించి కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది. ఎవరికి పడితే వారికి వెంటనే రుణాలు బ్యాంకులు మంజూరు చేయడం కదరదు. ఇందుకు పలు కఠిన నిబంధణలు ఆర్బీఐ తీసుకురానుంది. అవేంటంటే.. ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని అది తిరిగి చెల్లించని పక్షంలో కస్టమర్‌కు కొత్తగా మరో రుణం బ్యాంకులు మంజూరు చేయాలంటే సరైన గైడ్ లైన్స్ పాటించాలి. ఏ పరిస్థితుల్లో కొత్త రుణాలు మంజూరు చేస్తున్నారు..? వాటిని సరైన ప్రయోజనాల కోసం ఎలా ఉఫయోగించుకుంటున్నారు? అనేది వివరించే స్పష్టమైన బోర్డు ఆమోదించిన విధానం ఉండాలని ఎన్ఎఫ్‌బీసీ సంస్థలకు ఆర్బీఐ సూచించింది.

ఆర్బీఐ సీరియస్

ఒక లోన్ తీసుకున్న కస్టమర్.. అది చెల్లించకుండానే ఎన్ఎఫ్‌బీసీ సంస్థలు మరో లోన్ మంజూరు చేస్తున్నాయి. దీనిపై మూడు ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలను ఆర్బీఐ ప్రశ్నించింది. ఒక లోన్ చెల్లించకుండానే మరో రుణం ఎందుకు మంజూరు చేస్తున్నారనేది చెప్పాలని ప్రశ్నించింది. కొన్ని సందర్భాల్లో వెహికల్ లోన్ డీఫాల్ట్ అయినా, అదే సమయంలో ఆస్తి, హోమ్ లోన్ పేరుతో కొత్త రుణాలు ఎన్ఎఫ్‌బీసీ సంస్థలు మంజూరు చేస్తున్నట్లు ఆర్బీఐ వార్షిక తనిఖీల సమయంలో గుర్తించింది. అనంతరం దీనిపై ఆయా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త లోన్‌ను పూర్తిగా తిరస్కరించకూడదని తామ సూచించడం లేదని ఆర్బీఐ.. ఇందుకోసం సరైన విధానం అవలంభించాలని సూచించింది.

ఎవర్ గ్రీనింగ్ అంటే..?

సమస్మాతక రుణగ్రహీత పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి కొత్త రుణం ఇచ్చే పద్దతిని ఎవర్ గ్రీనింగ్ అంటారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో ఇది మొండి బకాయిల నిజమైన స్టేటస్‌ను దాచిపెడుతుంది. నిబంధనల ప్రకారం ఈఎంఐ 90 రోజుల గడువు ముగిసిపోతే.. దానిని నిరర్దక ఆస్తిగా ప్రకటించారు. మొదటి డీఫాల్ట్ తర్వాత ఎస్‌ఎంఏ-0 అకౌంట్‌గా పరిగణిస్తారు. ఇక 3160 రోజులు ఆలస్యమైతే ఎస్‌ఎంఏ-1, 6190 రోజుల ఆలస్యమైతే ఎస్‌ఎంఏ-2 అకౌంట్‌గా పరిగణిస్తారు. ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు అంతర్గత రుణ విధానంలో దీనిని పొందుపర్చాలి. అయితే రూ.250 కోట్ల కంటే ఎక్కువ నిరక విలువ, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉన్న సంస్థలకు ఇలాంటి పరిమితులు విధించాలని ఆర్బీఐ యోచిస్తోంది. భవిష్యత్తులో మొండి బకాయిలను దాచకుండా ఇలాంటి కొత్త నిబంధలను తీసుకురావాలని ఆర్బీఐ చూస్తోంది. త్వరలోనే వీటి అమలుకు సిద్దమువతోంది. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, రుణాల చెల్లింపుల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా వీటిని అమలు చేయనుంది. దీంతో త్వరలో రుణాలకు సంబంధించి కఠిన రూల్స్ రానున్నాయి.

Follow Us