AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు భారీ స్పందన.. అప్లై చేసిన వారందరికీ షేర్లు వస్తాయా.. పూర్తి వివరాలు..

LIC IPO: LIC ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. మే 4న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ ఐపీవో.. చివరిరోజు(మే9న) కూడా మంచి స్పందన లభించింది.

LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు భారీ స్పందన.. అప్లై చేసిన వారందరికీ షేర్లు వస్తాయా.. పూర్తి వివరాలు..
Lic Ipo
Ayyappa Mamidi
|

Updated on: May 10, 2022 | 12:33 PM

Share

LIC IPO: LIC ఐపీవోకు ఇన్వెస్టర్ల(Investors) నుంచి మంచి స్పందన లభించింది. మే 4న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ ఐపీవో.. చివరిరోజు(మే9న) కూడా మంచి స్పందన లభించింది. ఇష్యూ 2.95 సార్లు సబ్‌స్క్రైబ్ అవటంతో పాటు.. 16.2 కోట్ల షేర్లకు గాను 47.77 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. పాలసీదారుల కోసం రిజర్వ్ చేసిన భాగం 6.10 రెట్లు, సిబ్బంది కోసం ఉంచిన భాగం 4.39 రెట్లు, రిటైల్ పెట్టుబడిదారుల కోసం అందుబాటులో ఉంటిన భాగం 1.99 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. QIBలకు కేటాయించిన భాగం 2.83 రెట్లు బిడ్లను అందుకుంది. అయితే NIIల వాటా 2.91 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఎల్ఐసీ షేర్లు మే 17న స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ కానున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎల్‌ఐసీ ఐపీవో ఆలస్యమైందని, ఈ ఇష్యూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ట్రెంత్ చూపుతోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ తుహిన్ కాంటా పాండే తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లు ఆశించిన స్థాయిలో పెట్టుబడులు పెట్టడం లేదనే ప్రశ్నకు పాండే  ఇలా స్పందించారు. పూర్తిగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులపై ఆధారపడలేమని, దేశీయ పెట్టుబడిదారులపై నమ్మకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇష్యూ విజయవంతమైందన్నారు. లిస్టింగ్ డేపై ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నట్లు వెల్లడించారు. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం.. పార్లమెంటులో విదేశీ మదుపరులు పెట్టుబడులను ఉపసంహరించుకోవటంపై ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. భారత ఇన్వెస్టర్లు కీలకంగా మారి మార్కెట్లలోని ఒడిదొడుకులను స్వీకరిస్తున్నారని తెలిపారు.

సగానికి తగ్గిన గ్రే మార్కెట్ ప్రీమియం..

ఇవి కూడా చదవండి

IPO గ్రే మార్కెట్ ప్రీమియం 52.9% కంటే ఎక్కువ తగ్గి రూ.40కి పరిమితమైంది. గతంలో ఇది రూ.85గా ఉంది. ప్రతికూల మార్కెట్‌ సెంటిమెంట్లే ఈ పతనానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి US ఫెడ్ వడ్డీ రేట్లను పెంచటం వల్ల ప్రపంచ మార్కెట్ ఒత్తిడిలో ఉంది. ద్రవ్యోల్బణం మొత్తం ప్రపంచానికి ఒక సమస్యగా మారింది.

అందరికీ షేర్లు వస్తాయా?

ఎల్‌ఐసీ ఇష్యూ పరిమాణం 21 వేల కోట్లు. ఇప్పటి వరకు భారత్‌లో ఇదే అతిపెద్ద IPO. అందువల్ల IPO కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మందికి షేర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే.. IPOలో పార్టిసిపేట్ చేస్తున్నవారిలో ఎక్కువ మందికి షేర్లు ఎలాట్ అయ్యే అవకాశం ఉండవచ్చు.

ఎల్‌ఐసీలో ప్రభుత్వం ఎందుకు వాటా విక్రయిస్తోంది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్థిక వ్యవస్థ క్లిష్ట దశలో ఉంది. ప్రభుత్వ బాధ్యత గణనీయంగా పెరిగింది. ప్రభుత్వానికి నిధుల అవసరం చాలా ఉంది. నిధుల అవసరాలను తీర్చడానికి రుణాలపై ఆధారపడటానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఈ కారణంగానే LIC IPO తీసుకురావడానికి ముఖ్యకారణంగా భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Adani Green: అద్బుతాలు సృష్టిస్తున్న అదానీ గ్రీన్ స్టాక్.. మార్కెట్ క్యాప్ లో SBIని వెనక్కి నెట్టిన సంస్థ..

Twitter: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం వెలుగులోకి..