AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Loan: ఈ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారా..? మరింత పెరగనున్న EMIల భారం!

Bank Loan: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (IOB) రుణాలు నేటి నుంచి ఖరీదైనవి కానున్నాయి. IOB రెపో ఆధారిత రుణ రేటు ఈ రోజు నుండి అంటే మే 10 నుండి 7.25 శాతానికి..

Bank Loan: ఈ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారా..? మరింత పెరగనున్న EMIల భారం!
Subhash Goud
|

Updated on: May 10, 2022 | 9:21 AM

Share

Bank Loan: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (IOB) రుణాలు నేటి నుంచి ఖరీదైనవి కానున్నాయి. IOB రెపో ఆధారిత రుణ రేటు ఈ రోజు నుండి అంటే మే 10 నుండి 7.25 శాతానికి పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ని 7.25 శాతానికి సవరించాయి. అంతకుముందు రోజు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా తమ రుణ రేట్లను పెంచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత వారం పాలసీ రేటును 0.40 శాతం నుంచి 4.40 శాతానికి పెంచింది. దీని తర్వాత చాలా బ్యాంకులు తమ రుణాలను ఖరీదైనవిగా మార్చాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ RLLR 4.40% + 2.85 % = 7.25%గా మారింది. RLLR పెరుగుదలతో, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా అన్ని రకాల రుణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. కస్టమర్లు ఎక్కువ మొత్తంలో ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.

PNB రుణం కూడా ఖరీదైనది:

ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) రెపో లింక్డ్ లెండింగ్ రేటును 0.40 శాతం పెంచింది. రుణ రేటు 6.50 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగింది. జూన్ 1 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుత కస్టమర్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. RLLR కొత్త రేట్లు మే 7 నుండి అమలులోకి వచ్చాయి. మీ EMI పెరుగుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సోమవారం మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ (ఎంసిఎల్‌ఆర్)ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది అన్ని రకాల రుణాలపై ప్రభావం చూపుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుండి రుణం తీసుకున్న వారి ప్రస్తుత ఇఎంఐ పెరుగుతుంది. MCLR అనేది బ్యాంకు వడ్డీ రేటు ఆధారంగా నిర్ణయించబడే వడ్డీ రేటు. ఏ రుణానికైనా వడ్డీ రేటు అంతకంటే తక్కువ ఉండకూడదు.

ఇవి కూడా చదవండి

కెనరా బ్యాంక్ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ని 7.30 శాతానికి పెంచింది. బ్యాంక్ MCLR ఆధారిత రుణ రేట్లను కూడా మార్చింది. దీనిలో ఒక సంవత్సరం రేటు 7.35 శాతం. ఒక రోజు నుండి ఆరు నెలల వరకు MCLR 6.65 నుండి 7.30 శాతం పరిధిలో ఉంటుంది. కొత్త రేట్లు మే 7, 2022 నుండి అమలులోకి వచ్చాయి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లు పెంపు:

రెపో రేటు పెంపుతో, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు కూడా పెరుగుతాయి. వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. కోటక్ బ్యాంక్ FD రేట్లను పెంచడం ద్వారా కస్టమర్లకు ఉపశమనం కలిగించింది. రిటైల్ కస్టమర్ల కోసం వివిధ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రేట్లు పెంచాయి. కొత్త రేట్లు మే 6 నుండి అమల్లోకి వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌