Andhra Pradesh: బీ-ఫార్మసి విద్యార్థిని మృతి ఘటనలో మరో కీలక పరిమాణం.. అనుమానాలు రేకెత్తిస్తున్న పోలీసుల వ్యవహారం

బీ-ఫార్మసి విద్యార్థిని మృతి ఘటనలో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. విద్యార్థిని పై అత్యాచారం జరగలేదని చెప్పిన పోలీసులు ఆ తర్వాత రేప్ కేస్ పెట్టారు. కానీ తాజాగా విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని,...

Andhra Pradesh: బీ-ఫార్మసి విద్యార్థిని మృతి ఘటనలో మరో కీలక పరిమాణం.. అనుమానాలు రేకెత్తిస్తున్న పోలీసుల వ్యవహారం
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 10, 2022 | 1:17 PM

బీ-ఫార్మసి విద్యార్థిని మృతి ఘటనలో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. విద్యార్థిని పై అత్యాచారం జరగలేదని చెప్పిన పోలీసులు ఆ తర్వాత రేప్ కేస్ పెట్టారు. కానీ తాజాగా విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని, నిందితుడు చెప్పిన వివరాల మేరకు సెక్షన్ 376 నమోదు చేసినట్టు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ వివరించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా అత్యాచారం జరలేదని, ఇది హత్య కాదని తేల్చినట్టు డీఎస్పీ వెల్లడించారు. విద్యార్థిని శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవని, నిందితుడు విద్యార్థినితో పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా కలిసిన నేపథ్యంలోనే రేప్ కేస్, చీటింగ్ కేస్ నమోదు చేసినట్టు వివరించారు. పోస్టుమార్టంలో అత్యాచారం జరగలేదని, హత్య కాదని వైద్యులు తేల్చారని పోలీసులు చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత ఇంకా వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సత్యసాయి జిల్లా గోరంట్లలో జరిగిన బీ-ఫార్మసీ విద్యార్థిని మృతి ఘటనపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి.. నిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత హత్య జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించారు. విద్యార్థిని మృతదేహానికి అంత హడావిడిగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విద్యార్థిని శరీరంపై గాయాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇది హత్య అని చెబుతుంటే పోలీసులు ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు. దీని వెనుక వైసీపీ నాయకుల ఒత్తిడి ఉందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో అనుమానాస్పద రీతిలో బీ-ఫార్మసీ విద్యార్థిని మృతి చెందింది. వ్యవసాయ పొలంలోని ఓ షెడ్డులో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తే నమ్మించి హత్య చేశాడని తల్లిదండ్రుల ఆరోపిస్తుండగా.. ఆమెది ఆత్మహత్యేనని స్థానిక డీఎస్పీ రమాకాంత్‌ పేర్కొనడంపై మృతురాలి బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల మేరకు మరోసారి శవపరీక్ష నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

ఇవి కూడా చదవండి

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?