Andhra Pradesh: టెన్త్ పేపర్ లీక్ కేసులో విస్తుపోయే నిజాలు! నారాయణ విద్యార్ధులకు ర్యాంకులు రావాలనే దురుద్ధేశ్యంతో బరితెగింపు..

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వినియోగించిన ఫోన్లలో కీలక డేటా బయటపడింది. కేవలం తమ విద్యాసంస్థలకు ర్యాంకులు..

Andhra Pradesh: టెన్త్ పేపర్ లీక్ కేసులో విస్తుపోయే నిజాలు! నారాయణ విద్యార్ధులకు ర్యాంకులు రావాలనే దురుద్ధేశ్యంతో బరితెగింపు..
Ap Ssc Paper Leak
Follow us
Srilakshmi C

|

Updated on: May 10, 2022 | 1:20 PM

AP SSC 2022 Exam Question papers leaked from Narayana Educational Institutions: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి 2022 పబ్లిక్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌పై ఏపీ సర్కార్‌ కఠిన చర్యలకు పూనుకుంది. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది టెన్త్‌ ప్రశ్నపత్రాలను (10th class question paper leak case) వాట్సాప్‌లో షేర్‌చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నారాయణ సంస్థల అధినేత టీడీపీ మాజీ మంత్రి నారాయణను (TDP former minister Narayana) పోలీసులు మంగళవారం (మే 10) అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్‌ 4న నారాయణ కాలేజి వైస్‌ ప్రిన్సిపల్‌తో సహా మరికొందరిని అరెస్టు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరితోపాటు పేపర్‌లీక్‌ ఉదంతంలో పాలుపంచుకున్న పలువురు టీచర్లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఫోన్లలో కీలక డేటా.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వినియోగించిన ఫోన్లలో కీలక డేటా బయటపడింది. కేవలం తమ విద్యాసంస్థలకు ర్యాంకులు రావాలనే దురాలోచనతో నారాయణ సిబ్బంది బరితెగింపు చర్యలకు పాల్పడింది. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి, షేర్‌చేసి తమ విద్యార్ధులకే ఎక్కువ మార్కులు వచ్చేలా అక్రమాలకు తెరదించారు. ఎవరి ఆదేశాలమేరకు ఈ వ్యవహారాన్ని నడిపారు, ఎన్నేళ్లుగా ఇదంతా నడుస్తుందన్న దానిపై చిత్తూరు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇక వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే ఈ విధమైన విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.  ఈ కేసులో ఏపీ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

మాజీ మంత్రి నారాయణ అరెస్టు ఇలా.. నారాయణ సంస్థల అధినేత టీడీపీ మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఏ నేరం కింద నారాయణను అరెస్ట్‌ చేశారనే విషయాన్ని పోలీసులు అధాకారికంగా ఇంకా ప్రకటించలేదు.

కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాలు వరుసగా లీక్‌ అయ్యాయి. ఈ లీకేజీ వెనుక శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Also Read:

Andhrapradesh: పోలీసుల అదుపులో ఏపీ టీడీపీ మాజీ మంత్రి నారాయణ

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..