Telangana Weather Report: ఈ రెండు రోజులు జాగ్రత్త.. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్..!
Telangana Weather Report: భానుడు భగ్గుమంటున్న వేళ తుఫాన్ ప్రభావం ముంచుకొస్తుంది. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడుతుంది.
Telangana Weather Report: భానుడు భగ్గుమంటున్న వేళ తుఫాన్ ప్రభావం ముంచుకొస్తుంది. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడుతుంది కానీ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండ తీవ్రతకు ఉక్కపోతకు జనం అల్లాడిపోతున్నారు. ఈరోజు నుండి రాగల నాలుగు రోజుల వరకు ఈశాన్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు రేపు ఎండ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలాఉంటే.. బంగాళాఖాతంలో తిష్టవేసిన అసని తుపాను రేపు తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.