AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asani Cyclone AP: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్‌ ముప్పు.. ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన..!

Asani Cyclone AP: ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుంది. సోమవారం

Asani Cyclone AP: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్‌ ముప్పు.. ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన..!
Asani
uppula Raju
|

Updated on: May 10, 2022 | 5:00 AM

Share

Asani Cyclone AP: ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుంది. సోమవారం రాత్రి కాకినాడకు 390 కి.మీ., విశాఖపట్నంకు 390 కి.మీ., గోపాలపూర్ కు 510 కి.మీ., పూరీకు 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మంగళవారం క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా వైపు వెళ్ళే అవకాశం ఉంది. సాయంత్రంలోపు తుపానుగా బలహీనపడే అవకాశం ఉంది. అసని తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. అసని తుపాను ప్రభావంతో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కోస్తాంధ్ర జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందస్తు సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నట్టు విపత్తుల సంస్థ డైరెక్టర్ తెలిపారు.

మరిన్ని వాతావరణ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

MI vs KKR: కోల్‌కతా సూపర్ విక్టరీ.. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై..

Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలు ఉంటే అది విటమిన్‌ డి లోపం..!

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!