MI vs KKR: కోల్‌కతా సూపర్ విక్టరీ.. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై..

MI vs KKR: ఐపీఎల్‌ 2022లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన

MI vs KKR: కోల్‌కతా సూపర్ విక్టరీ.. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై..
Mi Vs Kkr
Follow us

|

Updated on: May 09, 2022 | 11:24 PM

MI vs KKR: ఐపీఎల్‌ 2022లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై చతికిలపడింది. 17.3 ఓవర్లలో 113 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో కోల్‌కతా 52 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ముంబై ప్లేయర్లలో ఇషాన్‌ కిషన్‌ 51 పరుగులు మినహాయించి ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కోల్‌కతా బౌలర్ల ముందు ముంబై బ్యాటర్లు నిలవలేకపోయారు. వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ముఖ్యంగా ప్యాట్‌ కమిన్స్‌ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి ముంబయిని చావుదెబ్బ కొట్టాడు. ఆండ్రూ రస్సెల్‌ 2, టిమ్‌ సౌథీ 1, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్‌ చొప్పున సాధించారు. ముంబయి తొమ్మిదో ఓటమిని నమోదు చేసుకోగా.. కోల్‌కతాకిది ఐదో విజయం.. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా (10) ఏడో స్థానానికి చేరుకుంది.

అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెన్‌ వెంకటేష్‌ అయ్యర్‌ (43), అజింక్యా రహాన్‌ (25) మంచి పాట్నర్‌షిప్‌ నమోదు చేశారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్స్‌లో బుమ్రా చెలరేగాడు. 4 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇక కార్తికేయ 2 వికెట్లు తీసుకోగా, డేనియల్‌ సామ్స్‌, అశ్విన్‌ చేరో ఒక వికెట్‌ సాధించారు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: పోలీసులపై పంజా విసిరిన చిరుత.. ప్రాణాలకు తెగించి ఎలా బంధించారో మీరే చూడండి..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

Rakul Preet Singh: అది సిగ్గుపడాల్సిన విషయం కాదు.. రకుల్ సంచలన కామెంట్స్