AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!

Viral Video: తమ పనిని నిజాయితీగా కష్టపడి అంకిత భావంతో చేసేవారు ఇతరుల కన్నా వేగంగా పూర్తిచేస్తారు. సోషల్ మీడియాలో దీనికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. అలాంటి

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!
Waitress Open Bottle Cap
uppula Raju
|

Updated on: May 09, 2022 | 7:15 AM

Share

Viral Video: తమ పనిని నిజాయితీగా కష్టపడి అంకిత భావంతో చేసేవారు ఇతరుల కన్నా వేగంగా పూర్తిచేస్తారు. సోషల్ మీడియాలో దీనికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. అలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతారు. తాజాగా ఒక మహిళా వెయిటర్‌ వీడియో ఇప్పడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె ఎంతో వేగంతో బీర్‌ బాటిల్‌ మూత ఓపెన్ చేస్తుంది. అయితే ఆమె స్పీడ్‌కి మనం మూత ఎలా తీస్తుందో కూడా కనిపెట్టలేం. ఈ వీడియో చూసిన నెటిజన్లు సూపర్‌ లేడీ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తు్న్నారు. ఇప్పడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఎక్కడ కనిపించినా చర్చనీయాంశంగా మారుతాయి. వార్తలు రాసే వరకు ఈ వీడియోకి 23 వేలకు పైగా లైక్స్ రాగా.. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో అది ఒక రెస్టారెంట్‌ అని తెలుస్తుంది. ఒక మహిళ వెయిటర్‌ డ్రింక్ సర్వ్ చేయడానికి వచ్చి ఆపై బాటిల్‌ను ఎత్తి ఓపెనర్‌తో బాటిల్ మూత తెరవడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే ఆ మహిళ ఓపెనర్‌ని చేతి వేళ్ల మధ్య తిప్పి బీర్ బాటిల్‌ను మూతను స్టైల్‌గా ఓపెన్‌ చేయడం చాలా అద్భుతం. ఈ వీడియోకు కభీ ఖుషీ కభీ గమ్ పాట జోడించారు. ఈ వీడియో ఇప్పుడు భారతీయ ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు వీడియోపై తమ స్పందనను తెలియజేస్తున్నారు.

ఒక నెటిజన్‌ ‘మహిళల వేగం నిజంగా ప్రశంసించదగినది’ అని తెలిపాడు. మరొక నెటిజన్‌ ‘ఈ ఎడిటింగ్ అద్భుతంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇది కాకుండా ఆ మహిళ చాలా అందంగా ఉందని కొంతమంది కామెంట్‌ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాఫిక్‌గా మారింది. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలపండి.

View this post on Instagram

A post shared by Techzexpress (@techzexpress)

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: జోస్‌ బట్లర్ ప్రత్యేక రికార్డ్‌.. ఆ విషయంలో తొలి రాజస్థాన్‌ ఆటగాడు..!

CSK vs DC: ఇరగదీసిన చెన్నై బౌలర్లు.. తేలిపోయిన ఢిల్లీ బ్యాటర్లు..

Mahatama Gandhi: బ్రిటన్‌లో మహాత్మాగాంధీ వస్తువులు వేలం.. ఏ ఏ వస్తువులు వేలం వేస్తున్నారంటే..?