AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: నేను బీజేపీ సమావేశాలకు వెళ్లడం లేదు.. క్లారిటీ ఇచ్చిన రాహుల్..

Rahul Dravid: హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయని.. ఆ వార్తలను ద్రవిడ్ కొట్టిపారేశారు. అవన్నీ నిజం కాదని..

BJP: నేను బీజేపీ సమావేశాలకు వెళ్లడం లేదు.. క్లారిటీ ఇచ్చిన రాహుల్..
Rahul Dravid
Sanjay Kasula
|

Updated on: May 11, 2022 | 12:58 PM

Share

టీమిండియా కోచింగ్ హెడ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ సమావేశాలకు వెళ్లడం లేదని తేల్చి చెప్పాడు. తాను వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయని.. ఆ వార్తలను ద్రవిడ్ కొట్టిపారేశారు. అవన్నీ నిజం కాదని స్పష్టం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మే 12 నుంచి 15వ తేదీ వరకు బీజేపీ యువ మోర్చా నేషనల్ వర్కింగ్‌ కమిటీ సదస్సు జరగనుంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. అయితే ఈ సదస్సుకు రాహుల్‌ ద్రవిడ్‌ హాజరుకానున్నారని ధర్మశాల ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా చెప్పినట్లు నిన్న పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ద్రవిడ్‌ ఈ సదస్సులో పాల్గొని యువతకు మంచి సందేశం ఇవ్వనున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ధర్మశాలలో జరగనున్న బీజేవైఎం జాతీయ కార్యవర్గ సమావేశానికి రాహుల్ ద్రవిడ్ హాజరవుతారని బీజేపీ ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా సోమవారం పేర్కొన్నారని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారుఎమ్మెల్యే ఈ ప్రకటన తర్వాత ద్రవిడ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు కూడా వచ్చాయి. మే 12 నుంచి 15 వరకు బీజేవైఎం జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇప్పుడు ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ వచ్చింది. 

రాహుల్ ద్రవిడ్ స్పందన..

క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన రాహుల్ ద్రావిడ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశాడు. అయితే త్వరలోనే హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణంగానే ద్రావిడ్ వెళ్తున్నట్లుగా వచ్చిన వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వార్తా సంస్థకు తన ప్రకటనను ఇస్తూ ద్రవిడ్.. ‘మే 12-15 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే సమావేశానికి నేను హాజరవుతానని మీడియాలోని ఒక వర్గం చెబుతోంది. 

మరికొద్ది నెలల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కథనాలపై ద్రవిడ్‌ స్పందించారు. మే 12-15 మధ్య నేను హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కావని టీమిండియా కోచ్‌ వెల్లడించారు.

జూన్ నుంచి మైదానంలోకి దిగనున్న భారత జట్టు జూన్ నుంచి

మరోసారి భారత క్రికెట్ జట్టు ఢీకొననుంది. నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ద్రావిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి   ఉన్నాడు. జూన్‌లో స్వదేశంలో జరిగే సిరీస్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. అతనితో టీమ్ ఇండియాను గెలిపించే సవాల్ కూడా రాహుల్ ద్రవిడ్ ముందు ఉంది.