6 బంతుల్లో 6 సిక్సర్లు.. బౌలర్లపై వీరవిహారం.. కట్ చేస్తే గంజాయి తాగుతూ అడ్డంగా బుక్కయ్యాడు..

6 బంతుల్లో 6 సిక్సర్లు.. బౌలర్లపై వీరవిహారం.. కట్ చేస్తే గంజాయి తాగుతూ అడ్డంగా బుక్కయ్యాడు..
Gibbs

హెర్షెల్ గిబ్స్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో..

Ravi Kiran

|

May 11, 2022 | 1:31 PM

హెర్షెల్ గిబ్స్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు. తన బ్యాట్‌తో ప్రత్యర్ధులపై విరుచుపడ్డాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా గిబ్స్ రికార్డ్స్ తిరగరాశాడు. అయితే గిబ్స్ బ్యాట్‌తోనే కాదు.. తన చేష్టలతోనూ అనేక సార్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అయ్యాడు.

అతను తన జట్టు కోసం ఎన్నిసార్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడో తెలియదు గానీ.. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం, అంటే మే 11, 2001న తన హోటల్ గదిలో గంజాయి తాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు హెర్షెల్ గిబ్స్. దానితో అతడు ఆరు నెలల నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది.

2001లో దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. సఫారీ జట్టు మే 11, 2001న ఆంటిగ్వాలో ఉన్నప్పుడు గిబ్స్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్ళు, పాల్ ఆడమ్స్, రోజర్ టెలిమ్‌ఖస్, ఆండ్రీ క్నెల్, జస్టిన్ క్యాంప్ ఆంటిగ్వాలోని ఒక హోటల్ గదిలో గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. గిబ్స్‌తో సహా ఇతర ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా బోర్డు 10,000 దక్షిణాఫ్రికా ర్యాండ్‌ల జరిమానాతో పాటు ఆరు నెలల నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

మద్యం మత్తులో మ్యాచ్ ఆడటం..

2005లో ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గిబ్స్‌ మద్యం సేవించి ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 434 పరుగులు చేయగా.. టార్గెట్ చేధించడంలో భాగంగా గిబ్స్ 111 బంతుల్లో 175 పరుగులు చేశాడు. దీనితో దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. గిబ్స్ ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 21 ఫోర్లు ఉన్నాయి. హ్యాంగోవర్‌‌తోనే ఇన్నింగ్స్ ఆడానని గిబ్స్ తన ఆత్మకథ ‘టు ది పాయింట్: ది నో హోల్డ్స్ బార్డ్’లో పేర్కొన్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu