- Telugu News Photo Gallery Cricket photos Australia Player Chris Lynn out of brisbane heat contract not renewed bbl 12
180 సిక్సర్లు.. 3005 పరుగులు.. బౌలర్లను దంచేసిన బ్యాటర్.. కట్ చేస్తే.. ఆ జట్టు నుంచి తప్పించారు..
ఈ ఆటగాడు 100 ఇన్నింగ్స్‌లలో 34 కంటే ఎక్కువ సగటుతో 3005 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో అత్యధికంగా ఈయన బ్యాట్ నుంచి 180 సిక్సర్లు రావడం గమనార్హం.
Updated on: May 11, 2022 | 2:40 PM

తుఫాన్ బ్యాటింగ్‌తో బౌలర్లను భయపెట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ క్రిస్ లిన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిగ్ బాష్ లీగ్ జట్టు బ్రిస్బేన్ హీట్ ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను జట్టు నుంచి తప్పించింది. క్రిస్ లిన్ బ్రిస్బేన్ హీట్‌తో 11 సీజన్‌లు కొనసాగాడు. కానీ, ప్రస్తుతం అతని కాంట్రాక్ట్ రద్దు చేశారు.

బ్రిస్బేన్ హీట్ నుంచి క్రిస్ లిన్ నిష్క్రమణ అతను కెప్టెన్సీ నుంచి తొలగించిన క్షణం నుంచి రచ్చ మొదలైంది. గత సీజన్లో, క్రిస్ లిన్ ప్రదర్శన ప్రత్యేకంగా లేదు. ప్రస్తుతం అతనితో జట్టు విడిపోయింది.

బిగ్ బాష్ లీగ్ చరిత్రలో క్రిస్ లిన్ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్. అతను 100 ఇన్నింగ్స్‌లలో 34 కంటే ఎక్కువ సగటుతో 3005 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో అత్యధికంగా లీన్ బ్యాట్ నుంచి 180 సిక్సర్లు రావడం పెద్ద విషయం.

బిగ్ బాష్ లీగ్ ఐదవ సీజన్‌లో క్రిస్ లిన్ అద్భుతాలు చేశాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 27 సిక్సర్ల సహాయంతో 378 పరుగులు చేశాడు. హోబర్ట్ హరికేన్స్‌పై క్రిస్ లిన్ 51 బంతుల్లో 101 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.

టీ20 క్రికెట్‌ను శాసించిన క్రిస్ లిన్ కెరీర్ ప్రస్తుతం ఓ వైపు దూసుకుపోతోంది. ఈ సంవత్సరం కూడా అతను IPL 2022 వేలంలో అమ్ముడవ్వలేదు. ప్రస్తుతం బ్రిస్బేన్ హీట్ కూడా అతనితో సంబంధాలను తెంచుకుంది. లీన్ తన కెరీర్‌ను ఎలా ట్రాక్‌లోకి తీసుకువస్తాడో చూడాలి.





























