punjab blast update: ఇంటెలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడి.. బయటపడ్డ పాక్ ప్రమేయం..!
punjab blast update: పంజాబ్ లోని మొహాలిలో ఇంటెలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడిలో పాక్ హస్తం బయటపడింది.
punjab blast update: పంజాబ్ లోని మొహాలిలో ఇంటెలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడిలో పాక్ హస్తం బయటపడింది. ఐఎస్‌ఏ చేతిలో పావుగా మారిన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్విందర్ రిందా ఈ దాడికి కుట్ర చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.
మొహాలి లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడిపై పంజాబ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పాకిస్తాన్‌లో నక్కిన ఖలిస్తాన్ ఉగ్రవాద నేత హర్విందర్ రిందా ఈ దాడికి కుట్ర పన్నినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కనుసన్నల్లో పనిచేస్తున్న హర్విందర్ భారత్‌లో పలు చోట్లు దాడులకు ప్లాన్ చేశాడు. పంజాబ్ ఐబీ కార్యాలయం దగ్గర కారులో వచ్చిన వచ్చిన రిందా అనుచరులే ఈ రాకెట్ దాడికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. రిందా అనుచరుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈవిషయాన్ని కనిపెట్టినట్టు వెల్లడించారు.
మొహాలి బ్లాస్ట్ కేసులో పోలీసులు ఇప్పటివరకు 20 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. కేసులో మాస్టర్‌మైండ్‌గా ఉన్న హర్విందర్‌రిందా లాహోర్‌లో ఆశ్రయం తీసుకుంటున్నాడు. పంజాబ్‌లో ఖలిస్తాన్ టెర్రర్‌ను విస్తరించడానికి రిందాను ఐఎస్‌ఐ పావుగా వాడుకుంటోంది. రాకెట్ దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులు పంజాబ్ నుంచి హర్యానాకు పారిపోయినట్టు తెలుస్తోంది. పారిపోయిన ఉగ్రవాదుల కోసం పంజాబ్ పోలీసులు భారీ గాలింపు చర్యలు చేపట్టారు.
పంజాబ్‌లో ఉగ్రదాడుల కోసం ఐఎస్‌ఐ కొత్త ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ ఖల్సాను ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్లతో తనకు ఉన్న పాత పరిచయాలతో టెర్రర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి హర్విందర్ రిందా ప్లాన్ చేస్తునట్టు కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. మొహాలి లోని పంజాబ్ ఇంటెలిజెన్ప్ కార్యాలయానికి భారీ సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికి పోలీసు కళ్లుగప్పి ఉగ్రవాదులు దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
హర్యానా లోని కర్నాల్‌లో కొద్దిరోజుల క్రితం భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ లోని ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్ర లోని నాందేడ్‌కు పేలుడు పదార్ధాలకు తరలిస్తుండగా పట్టుకున్నారు. దీని వెనుక కూడా హర్విందర్ రిందా హస్తం బయటపడింది.