Tamil Nadu: తమిళనాట దారుణం.. ప్రేమే వారు చేసిన నేరం.. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి..!

Tamil Nadu: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. ఆమె వితంతువు అయితేనేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధన్‌రాజ్‌ అనే వ్యక్తి. ఇది మహాపాపమని దాడి చేశారు

Tamil Nadu: తమిళనాట దారుణం.. ప్రేమే వారు చేసిన నేరం.. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి..!
Beating
Follow us
Shiva Prajapati

|

Updated on: May 11, 2022 | 5:24 AM

Tamil Nadu: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. ఆమె వితంతువు అయితేనేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధన్‌రాజ్‌ అనే వ్యక్తి. ఇది మహాపాపమని దాడి చేశారు మహిళ బంధువులు. సంచలనం రేపిన ఈ ఘటన తమిళనాడు లోని కొడైకెనాల్‌లో జరిగింది.

తమిళనాట మరో దారుణం వెలుగు లోకి వచ్చింది. కొడైకెనాల్ లో వితంతువు ని వివాహం చేసుకున్నాడని ఓ వ్యక్తిని చితకబాదారు ఆ మహిళ కుటుంబసభ్యులు. కాళ్ళు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆ వ్యక్తిపై బండ రాళ్లతో దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కొడైకెనాల్ కి చెందిన ధనరాజ్ , అదే ప్రాంతానికి చెందిన వితంతువు కలయమ్మాళ్ను ప్రేమించుకున్నారు. భర్త చనిపోవడం తో కూతురి తో పాటు నివాసముంటున్న కలయమ్మాళ్ ని వివాహం చేసుకున్నాడు ధనరాజ్ . ఈ వివాహాన్ని వ్యతరేకించిన కలయమ్మాళ్ కుటుంబసభ్యులు ధనరాజ్ ఫై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధన్‌రాజ్‌పై దాడి చేసిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ దాడిలో ధన్‌రాజ్‌కి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ ధన్‌రాజ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే తాను ఏ తప్పు చేశానో అర్ధం కావడం లేదంటున్నాడు ధన్‌రాజ్‌.

ఇవి కూడా చదవండి

కష్టాల్లో ఉన్న మహిళకు ఆమె ఇష్టపూర్వకంగానే కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు తాను ప్రయత్నించినట్టు చెప్పాడు. కాని కలియమ్మాళ్ను బంధువులు అకారణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆయన కోరుతున్నాడు. పెళ్లి కోసం తాను కలియమ్మాళ్నును బలవంతం చేయలేదని స్పష్టం చేశాడు ధన్‌రాజ్‌. కాని కొంతమంది కావాలనే టార్గెట్‌ చేశారని ఆరోపించాడు. పోలీసులు కలియమ్మాళ్ను స్టేట్‌మెంట్‌ని కూడా రికార్డు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొడైకెనాల్‌ శివార్లలో జరిగిన ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం రేపింది. కలియమ్మాళ్నుబంధువులు మాత్రం ధన్‌రాజ్‌ తప్పు చేశాడంటున్నారు. మోసం చేసి అమాయకురాలైన కలియమ్మాళ్నుని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.