BJP vs TRS: వచ్చుడు.. విషం చిమ్ముడు.. పత్తా లేకుండా పోవుడు.. ఇదే మీ స్ట్రాటజీయా? అమిత్‌షాకు కేటీఆర్ ఘాటు లేఖ..
Amit shah Telangana tour: తెలంగాణపై కేంద్రం అడగడుగునా వివక్ష చూపుతోందని, అమిత్‌షా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ అమిత్‌షాకుఘాటు లేఖరాశారు.
Amit shah Telangana tour: కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా (Amit shah) రేపటి (మే 14) నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు. తుక్కుగూడలో నిర్వహించే ఓ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో అమిత్‌షా పర్యటనను విజయవంతం చేయడానికి ఓ వైపు బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు టీఆర్‌ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణపై కేంద్రం అడగడుగునా వివక్ష చూపుతోందని, అమిత్‌షా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారంటూ మండిపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ అమిత్‌షాకుఘాటు లేఖరాశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతూనే ఉందని ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపుతున్న బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అమిత్ షాను సూటిగా ప్రశ్నిస్తూ 27 ప్రశ్నలను సంధించారు.
హామీల కోసం ఎందాకైనా..
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారని ఈ లేఖలో విమర్శించారు కేటీఆర్. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ‘రాష్ట్రానికి వచ్చుడు.. విషంచిమ్ముడు.. పత్తాలేకుండా పోవుడు.. ఇదే మీ స్ట్రాటజీయా’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ఎందాకైనా కొట్లాడుతామని స్పష్టం చేశారు. ఎన్ని చెప్పినా, ఎంత ప్రశ్నించినా తెలంగాణపై మీ వైఖరిలో మార్పు రాదని తెలంగాణ సమాజం బలంగా విశ్వసిస్తున్నట్లు లేఖలో తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: