JC Prbhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మారూరు టోల్‌గేట్ వద్ద ఉద్రిక్తత..
AP Politics: ఉజ్వల ఫౌండేషన్ అక్రమాలపై కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకోవడంపై జేసీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అందుకు సంబంధించిన మ్యాప్‌లను కూడా ఆయన చూపారు
AP Politics: అనంతపురం జిల్లా రాప్తాడు మరూరు టోల్‌గేట్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తికి వస్తున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prbhakar Reddy)ని పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉజ్వల ఫౌండేషన్ అక్రమాలపై కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకోవడంపై జేసీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఉజ్వల ఫౌండేషన్ లేఔట్‌లో అక్రమాలు జరుగుతున్నందునే ప్రశ్నించడానికి వచ్చినట్లు పేర్కొన్నారు ప్రభాకర్‌రెడ్డి. లేఔట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని తన స్నేహితులు చెప్పినందువల్లే అడిగేందుకు వెళ్తున్నాను. అందుకు సంబంధించిన మ్యాప్‌లను కూడా ఆయన చూపారు. తాడిపత్రిలో ఉండే తాను పుట్టపర్తికి వస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జేసీ. ఫౌండేషన్‌లో అక్రమాలను బయటపెట్టితీరుతానన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కలెక్టర్‌ను కలిసి తీరుతానని జేసీ స్పష్టం చేయడంతో అప్రమత్తమైన పోలీసులు.. ముందస్తు జాగ్రత్తగా జేసీని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
కాగా పుట్టపర్తి పట్టణ సమీపంలో గల ఉజ్వల ఫౌండేషన్ లో ఉమ్మడి ఆస్తుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీతో పాటు వామపక్ష నాయకులు ఆరోపిస్తున్నాయి. అధికార నాయకులే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన పుడా, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లేఔట్ అక్రమాలపై కలెక్టర్‌ను కలిసేందుకు రెడీ అయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: