AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bjp vs Trs: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన అమిత్ షా సభ.. టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల యుద్ధం..!

Bjp vs Trs: హైదరాబాద్‌లో రేపటి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేశారు బీజేపీ నేతలు. తుక్కుగూడలో నిర్వహించనున్న..

Bjp vs Trs: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన అమిత్ షా సభ.. టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల యుద్ధం..!
Kishan Reddy
Shiva Prajapati
|

Updated on: May 13, 2022 | 5:14 PM

Share

Bjp vs Trs: హైదరాబాద్‌లో రేపటి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేశారు బీజేపీ నేతలు. తుక్కుగూడలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మంత్రి కిషన్‌రెడ్డి. రేపటి బహిరంగసభలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ బీజేపీపై విషప్రచారం చేయడం మానుకోవాలని హితవుపలికారు.

మరోవైపు హైదరాబాద్‌లో రేపటి కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటనపై ఫైరయ్యారు టీఆర్‌ఎస్‌ నేతలు. రాష్ట్రానికి ఏం ఇచ్చారని చెప్పుకోవడానికి వస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ఎవరొచ్చినా.. ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. అమిత్‌షా రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారన్నారు ఎంపీ రంజిత్‌ రెడ్డి. రాష్ట్రానికి ఏం ఇచ్చారని గొప్పలు చెప్పుకోవడానికి వస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా టూరిస్టులా కాకుండా రాష్ట్ర అభివృద్ధికోసం ఆలోచించాలన్నారు మంత్రి సబిత. రాష్ట్రంపై వివక్షపూరితంగా వ్యవహరించడమే కాకుండా.. అబద్ధాలు ప్రచారం చేసేందుకు వస్తున్నారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రేపటి సభలో జాతీయహోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారామె.

వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..