AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బండి సంజయ్‌‌కు లీగల్ నోటీస్ పంపిన మంత్రి కేటీఆర్..

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. సంజ‌య్‌వి హాస్యాస్ప‌ద‌మైన‌, ఆధార ర‌హిత‌మైన ఆరోప‌ణ‌లు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Telangana: బండి సంజయ్‌‌కు లీగల్ నోటీస్ పంపిన మంత్రి కేటీఆర్..
Ktr Bandi Sanjay
Ram Naramaneni
|

Updated on: May 13, 2022 | 5:23 PM

Share

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌(Trs), బీజేపీ మధ్య నడుస్తున్న రాజకీయ విమర్శలు ఇక లీగల్‌ రూట్‌లోకి వచ్చాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మున్సిపల్‌ మంత్రి KTR లీగల్‌ నోటీస్‌ పంపించారు. ఈ నెల 11న ట్విట్టర్‌లో తనపై బండి సంజయ్‌ చేసిన ఆరోపణలు నిరాధారమని KTR తన లీగల్‌ నోటీసులో పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని లేదంటా బహిరంగంగా క్షమాపణ కోరాలని KTR తన లీగల్‌ నోటీసులో డిమాండ్‌ చేశారు. 48 గంటల్లోపు బేషరతు క్షమాపణలు చెప్పాలని లీగల్‌ నోటీసులో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల మరణానికి కారణం KTR అంటూ ఈ నెల 11న బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. విద్యార్థుల మరణంపై సీఎం కనీసం స్పందించలేదని బండి సంజయ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. అదే రోజు KTR దాన్ని ఖండించారు.

మినిస్టర్ కేటీఆర్​పై నిరాధార ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో లాయర్ పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రజాజీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్​కు ఆపాదించే దురుద్దేశపూర్వకమైన ప్రయత్నం చేశారన్నారు. మంత్రి కేటీఆర్ పరువుకు నష్టం కలిగించేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్​కి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాటితో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్​కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది పేర్కొన్నారు.

ఇంతకీ కేటీఆర్‌లో కాకరేపిన బండి సంజయ్‌ కామెంట్స్ ఏంటి? ఇంటర్‌ విద్యార్థుల మరణంపై బండి సంజయ్‌ ఎలాంటి ఆరోపణలు చేశారు.. దానిపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారో దిగువ ట్వీట్స్‌లో చూడండి.