ACSR GMC Nellore Jobs 2022: టెన్త్ అర్హతతో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కాలేజీలో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం నెల్లూరు జిల్లా (Nellore District)లోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓట్‌సోర్సింగ్ ప్రాతిపదికన..
ACSR GMC Nellore Lab Attendant Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం నెల్లూరు జిల్లా (Nellore District)లోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ల్యాబ్ అటెండెంట్ (Lab Attendant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 6
- అటెండెంట్ పోస్టులు: 3
- ఫీమేల్ నర్సింగ్ అర్డర్లీ పోస్టులు: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.12,000ల నుంచి రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: ప్రిన్సిపల్ కాలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఏసీఎస్‌ఆర్ జీఎంసీ నెల్లూరు, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: