High Cholesterol: పాదల్లో వచ్చే నొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అది హార్ట్ స్ట్రోక్‌గా మారొచ్చు.. వైద్యులు ఏమంటున్నారంటే..
పాదాలలో కనిపించే అధిక కొలెస్ట్రాల్ కొన్ని లక్షణాలను నిర్దారించారు. ఈ లక్షణాలను అస్సలు పట్టించుకోకుండా తప్పు చేయకూడదని హెచ్చరించారు.
అధిక కొలెస్ట్రాల్ నేటి కాలంలో చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. 2018 నివేదిక ప్రకారం, భారతదేశంలో హృదయ సంబంధ వ్యాధులతో మరణించే వారి రేటు 34 శాతం పెరిగింది. మరణాల రేటు 155.7 నుంచి 209.19 శాతానికి పెరిగింది. మరణించిన వారిలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి మంచి ఆహారంతో పాటు.. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం.. తద్వారా కొలెస్ట్రాల్ సకాలంలో నియంత్రించుకోవచ్చు. ఈ కాలంలో ఈ జీవన విధాన వ్యాధి చాలా సాధారణం అయిపోయింది. మీ రక్తంలో సాధారణం కంటే అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, దాన్ని ‘అధిక కొలెస్ట్రాల్ స్థితి’ అంటారు. అది చాలా తీవ్రమైన సమస్య. తీవ్రమైన గుండెజబ్బులకు, స్థూలకాయం, ఇతర అలాంటి వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ముఖ్య కారణం. ఆరోగ్యానికి ఈ కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్స్ చాలా అవసరం.
జీవనవిధాన మార్పులు అంటే ఆరోగ్యకర డైట్, రోజువారీ వ్యాయామం, కొన్ని ముఖ్యమైన మందులు వాడకంతో అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మీకు అధిక కొలెస్ట్రాల్ ఉంటే, ఈ కింది అనారోగ్యకర అలవాట్లను మానుకోవడం మంచిది. ఇది ఆరోగ్య ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇటీవల, ఓ నిపుణుడు పాదాలలో కనిపించే అధిక కొలెస్ట్రాల్ కొన్ని లక్షణాలను నిర్దారించారు. ఈ లక్షణాలను అస్సలు పట్టించుకోకుండా తప్పు చేయకూడదని హెచ్చరించారు. మీరు కూడా ఈ లక్షణాలను మీ శరీరంలో గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని కలవండి
కొలెస్ట్రాల్ అంటే ఏమిటి
కొలెస్ట్రాల్ కాలేయంలో తయారయ్యే ఫ్యాట్. ఇది రెండు రకాలు మంచి కొలెస్ట్రాల్ అంటే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ (LDL). LDL కొలెస్ట్రాల్ శరీరానికి ప్రమాదకరం. దీని పెరుగుదల వల్ల శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. అధిక కొలెస్ట్రాల్ పరిస్థితిని చూసిన తర్వాత డాక్టర్ చికిత్స అందిస్తారు.
ఆరోగ్యకరమైన వ్యక్తికి కొలెస్ట్రాల్ కంటెంట్:
మొత్తం కొలెస్ట్రాల్: 200 కంటే తక్కువ – 239 mg/dL HDL: 60 mg/dL కంటే ఎక్కువ LDL: 100 mg/dL కంటే తక్కువ
అధిక కొలెస్ట్రాల్ ఈ లక్షణాలు పాదాలలో కనిపిస్తాయి..
వైద్యులు చెప్పినట్లుగా.. పరిస్థితి ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు సాధారణంగా కనిపించవు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిని గుర్తించడానికి రక్త పరీక్ష చేయవలసి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు పాదాలలో కనిపించడం ప్రారంభిస్తాయి.
- ఛాతి నొప్పి
- దిగువ శరీరం చల్లగా ఉంటుంది
- తరచుగా శ్వాస ఆడకపోవడం
- వికారం
- అలసినట్లు అనిపించు
- పెరిగిన రక్తపోటు
బేకరీ ఆహార పదార్థాలు తినటం
కేకులు, తెల్ల బ్రెడ్ వంటి పదార్థాలను తినడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ బేకరీ ఉత్పత్తులు అధిక మొత్తాల్లో ఈస్ట్, పంచదార, ఇతర ప్రాసెస్డ్ పదార్థాలతో తయారు చేస్తారు. ఈ వాడే వస్తువులు మన ఆరోగ్యానికి చాలా హానికరమైనవిగా చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతుంటే వీటికి దూరంగా ఉండటం మంచిది.
తక్కువ పీచు పదార్థాలున్న డైట్ తినటం వలన
అవసరమైన పోషకాలు ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, ఖనిజ లవణాలు వంటి వాటితో పాటు ఫైబర్ కూడా మనం సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఫైబర్ ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తనాళాల్లో పూత తయారవ్వకుండా తొలగిస్తుంది. అందుకని మీ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకలు, పండ్లు, ఆకు కూరలు వంటివి ఉండే విధంంగా చూసుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
హెల్త్ వార్తల కోసం..