నెల పాటు చపాతీ తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
25 December 2024
TV9 Telugu
TV9 Telugu
రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఒక్క రాత్రి పూట అనే కాదు.. రోజులో ఒకసారి చపాతీ తిన్నా కూడా మంచిదేనట
TV9 Telugu
చపాతీని పోషకాల సమ్మేళనంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఇందులో కాల్షియం, B6, B9, రాగి, భాస్వరం, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
చపాతీలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు. అందుకే రోజూ చపాతీ తినాలట
TV9 Telugu
పైగా చపాతీల్లో ఉండే అధిక ఐరన్ స్థాయులు శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయి. తద్వారా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు
TV9 Telugu
అయితే మీరు ఓ నెలపాటు చపాతీ తినడం మానేస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి చపాతీ అందరి ఆరోగ్యానికి ఒకేలా పోషకాలను అందించదు
TV9 Telugu
కొందరికి వీటిని తిన్న తర్వాత కడుపునొప్పి ప్రారంభమవుతుంది. వాస్తవానికి దీని వెనుక అసలు కారణం గోధుమలలో ఉండే గ్లూటెన్. కాబట్టి ఇలాంటి వారు చపాతీ మానేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం నుంచి ఉపశమనం కలుగుతుంది
TV9 Telugu
చపాతీలకు దూరంగా ఉంటే, చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది. ముఖం సహజ గ్లో పెరుగుతుంది. చపాతీకి బదులుగా ఇతర ధాన్యాలతో చేసిన బ్రెడ్ తింటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది
TV9 Telugu
గోధుమలతో చేసిన చపాతీలో GI 70 వరకు ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు గోధుమ పిండితో చేసిన చపాతీ తినకపోవడం మంచిది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది