AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పెను ప్రమాదం.. అయితే.. కొవ్వును నియంత్రించేందుకు జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్ గా పేర్కొంటారు..

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
Cholesterol Health Risk
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2024 | 7:06 PM

Share

ఉరుకుల పరుగుల జీవితంలో శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య పెను ప్రమాదకరంగా మారుతోంది.. కొలెస్ట్రాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అందుకే వైద్య నిపుణులు దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు.. ఇది గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, స్ట్రోక్ కు కారణమవుతుంది. శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్ గా పేర్కొంటారు.. అయితే.. హృద్రోగులకు అధిక కొలెస్ట్రాల్ అతిపెద్ద ప్రమాదం.. సిరల్లో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటే అది దీర్ఘకాలికంగా ప్రాణాంతకం కావచ్చు.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా, మీ ధమనులలో ఎంత మేర కొలెస్ట్రాల్ అడ్డంకులు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం..  అయితే.. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. వంటగదిలో ఉంచిన వస్తువులను తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.. కొలెస్ట్రాల్ నియంత్రణకు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి.. ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

కొలెస్ట్రాల్ నియంత్రణకు ఈ పదార్థాలు తీసుకోండి..

  1. ఉసిరి: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పరిమితికి మించి పెరిగితే.. మీరు ఉసిరిని తీసుకోవచ్చు. దీని కోసం, మీరు ఉసిరిని నేరుగా తినవచ్చు లేదా రసం, పొడి, టాబ్లెట్ రూపంలో ఉపయోగించవచ్చు.
  2. అర్జున బెరడు: మీరు అర్జున బెరడు గురించి చాలా తక్కువ విని ఉంటారు.. అర్జునుడి బెరడు అధిక కొలస్ట్రాల్‌ స్థాయిలకు నియంత్రిస్తుంది.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అర్జున బెరడు పొడిని పాలలో కలిపి రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హృద్రోగులు తరచుగా దీనిని తినమని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తారు.
  3. వెల్లుల్లి: వెల్లుల్లి చాలా వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగించే ఒక మసాలా దినుసు.. మీరు రోజూ 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు తింటే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్య దూరమవుతుంది.
  4. అల్లం: అల్లం రుచి ఘాటుగా మంటగా ఉన్నప్పటికీ.. రోజూ పచ్చిగా నమిలి తింటే, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా అల్లంతో చేసిన హెర్బల్ టీ తాగితే కూడా మేలు జరుగుతుంది.
  5. నిమ్మకాయ: విటమిన్ సితో సహా నిమ్మకాయలో చాలా పోషకాలు ఉన్నాయి.. దీని ద్వారా కొవ్వును కరిగించవచ్చు.. పొట్ట, నడుము కొవ్వును తగ్గించవచ్చు.. అలాగే సిరల నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి